Friday, 31 July 2026 01:29:31 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

తంబళ్లపల్లె కోర్టు హాజరైన జోగి రమేష్ బ్రదర్స్ పరామర్శించిన జోగి కుమారుడు మరియు స్థానిక ఎమ్మెల్యే పరామర్శ.

Date : 05 January 2026 08:12 AM Views : 600

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 4 : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రామును ఆదివారం రాత్రి 9:45 గంటలకు తంబళ్లపల్లె జూనియర్ సివిల్ కోర్టులో ఎక్సైజ్ పోలీసులు హాజరు పరిచారు. గత మూడు రోజుల క్రితం నెల్లూరు జైలు నుండి విచారణ నిమిత్తం ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకున్న విషయం పాఠకులకు తెలిసిందే. కస్టడీ పూర్తవడంతో ఆదివారం విజయవాడ నుండి తంబళ్లపల్లె కోర్టులో న్యాయమూర్తి ఉమర్ ఫరూక్ ముందు హాజరు పరిచారు. మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రామును తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారనాథరెడ్డి, జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ లు కోర్టు ప్రాంగణంలో పరామర్శించారు. మాజీమంత్రి జోగి రమేష్ రాక తెలుసుకున్న వైకాపా నాయకులు మధ్యాహ్నం నుండి ఎమ్మెల్యే ద్వారక నాధరెడ్డి స్వగృహం వద్ద మఖాం వేశారు. తంబళ్లపల్లె, ములకలచెరువు ఎస్ఐలు టి అనిల్ కుమార్, ప్రతాప్ ల పర్యవేక్షణలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జోగి రమేష్ ను తీసుకొస్తున్న వాహనాన్ని ఆర్టీసీ బస్టాండ్ వద్ద వందలాదిగా వైకాపా నాయకులు అడ్డుకొని జై జగన్ నినాదాలతో జయ జయ ద్వానాలు చేశారు. పోలీసులు వైకాపా నాయకులు , కార్యకర్తలను నిలువరించి జోగి రమేష్ వాహనాన్ని కోర్టు లోపలికి పంపించారు. కోర్టులో న్యాయమూర్తి ఉమర్ ఫరూక్ నిందితులకు తొమ్మిది రోజులు రిమాండ్ విధించడంతో వారిని ఎక్సైజ్ పోలీసులు మదనపల్లి స్పెషల్ సబ్ జైలుకు తరలించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :