Friday, 31 July 2026 02:03:51 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ లో నున్న వేతనాలు తక్షణమే చెల్లించాలి - సీపీఐ

భవిష్యత్తులో జీతాలు సమయానికి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి

Date : 09 February 2026 03:30 PM Views : 134

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 09 : మదనపల్లి మున్సిపాలిటీ, భవిష్యత్తులో జీతాలు సమయానికి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి పుంగనూరు మున్సిపాలిటీలో పెండింగ్లో ఉన్న డైలీ వేజెస్ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ ముభారక్, ఏఐటీయూసీ మదనపల్లి పట్టణ కార్యదర్శి తిరుమల డిమాండ్ చేశారు ఆ మేరకు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని, భవిష్యత్తులో సకాలంలో వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి, జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి మున్సిపాలిటీలో 2025 ఏప్రిల్ నెలలో డిసెంబర్ 2026 లో జనవరి నెలలకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.పుంగనురు మున్సిపల్ డైలీ వేజెస్ పారిశుద్ధ్య కార్మికులకు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించక పోవడంతో కార్మికులు కుటుంబ పోషణ ఇబ్బందికరంగా మారిందని సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి వేతనాలు చెల్లించాలని కోరారు రోజూ పట్టణ శుభ్రత కోసం పనిచేస్తున్న కార్మికులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడం మానవ హక్కుల ఉల్లంఘననే అన్నారు.పారిశుద్ధ్య కార్మికులు వేతనాలపై ఆధారపడి కుటుంబాలను పోషిస్తున్నారని, అద్దెలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు తీరక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఇంద్రాణి, డైలీ వేజెస్ పారిశుద్ధ్య కార్మికులు అన్నపూర్ణ, శ్రీదేవి, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :