Thursday, 30 July 2026 03:01:36 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడుకోండి - అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

నో హెల్మెట్ - నో ఫ్యూయల్' నిబంధన అమలుకు సన్నాహాలు

Date : 06 January 2026 06:02 PM Views : 201

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జనవరి 06 : రోడ్డు భద్రత అనేది కేవలం ఒక నిబంధన కాదు, అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా (జనవరి 01 నుండి 31 వరకు), మంగళవారం రాయచోటి పట్టణంలో హెల్మెట్ ధారణ ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ జిల్లా ఎస్పీ గారు స్వయంగా హెల్మెట్ ధరించి భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ కడప రింగ్ రోడ్ వద్ద ప్రారంభమై, శివాలయం చెక్ పోస్ట్ మీదుగా బంగ్లా వరకు ఉత్సాహంగా సాగింది. పోలీసు అధికారులు, సిబ్బంది, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, విద్యా సంస్థల ప్రతినిధులు మరియు పట్టణ బైక్ మెకానిక్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్డు భద్రతా నినాదాలతో ప్రజల్లో చైతన్యం నింపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ద్విచక్ర వాహన ప్రమాదాల్లో జరిగే మరణాలలో అధిక శాతం తలకు గాయాలు కావడం వల్లే జరుగుతున్నాయి. ఐఎస్ఐ (ISI) ముద్ర కలిగిన హెల్మెట్ ధరిస్తే ప్రాణాపాయం నుండి 80% పైగా తప్పించుకోవచ్చు. అతివేగం ఆపదకు మూలమని, యువత అత్యుత్సాహంతో బైక్ రేసింగ్‌లు చేసి విలువైన ప్రాణాలను బలి తీసుకోవద్దని కోరారు. మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడటం చట్టరీత్యా నేరమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ప్రమాదాల నివారణకు గాను, హెల్మెట్ ధరించని వాహనదారులకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపకూడదనే నిబంధనను కచ్చితంగా అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ యం. వెంకటాద్రి గారు, రాయచోటి డిఎస్పీ యం.ఆర్. కృష్ణమోహన్ గారు, ట్రాఫిక్ సి.ఐ. కులాయప్ప, రాయచోటి పట్టణ మరియు రూరల్ సి.ఐలు చలపతి, రోషన్, లక్కిరెడ్డిపల్లి సి.ఐ. కృష్ణంరాజు నాయక్, ఎం.వి.ఐ. సుబ్బరాయుడు, పలువురు ఎస్.ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :