Thursday, 30 July 2026 03:02:11 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

పాఠశాలలు, కళాశాలల సమీపంలో డ్రగ్స్ విక్రయాలపై కట్టుదిట్టమైన నిఘా - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

ఆపరేషన్ వజ్ర ప్రహార్ తో డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై ఉక్కుపాదం - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

Date : 28 March 2026 10:25 PM Views : 171

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి -మార్చి 28 : జిల్లాలో మాదకద్రవ్యాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మాదకద్రవ్యాల జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తో కలసి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా వాటి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యాల నివారణ రవాణాను అరికట్టేందుకు ప్రణాళిక బద్ధంగా సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాలోని అన్ని కళాశాలలు, పాఠశాలలు, విద్యాసంస్థల సమీపంలో మాదకద్రవ్యాల ఉత్పత్తుల వినియోగం, అమ్మకాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ముఖ్యంగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల నిర్వహణ కమిటీలు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు.పాఠశాల సమయాల్లో మాత్రమే కాకుండా, స్కూల్ అవర్స్ ముగిసిన తరువాత కూడా విద్యార్థుల ప్రవర్తనపై ఉపాధ్యాయులు బాధ్యతతో పర్యవేక్షణ కొనసాగించాలి. యూనిఫార్మ్‌లో ఉన్న విద్యార్థులు మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు గమనించినట్లయితే, వారిని కౌన్సిలింగ్ చేయడంతో పాటు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి.తరగతి బోధనతో పాటు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, మంచి అలవాట్ల పెంపుదలపై కూడా ఉపాధ్యాయులు దృష్టి సారించాలని సూచించారు

జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ ఈ సంవత్సరం జనవరి 01 నుండి మార్చి 28 వరకు జిల్లా మొత్తంలో 03 గంజాయి కేసులు పెట్టడం జరిగిందని 190 కేజీలు సీజ్ చేయడం జరిగిందని, 16 మంది నిందితులను గుర్తించి వారిలో 10 మంది అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం“ఆపరేషన్ వజ్ర ప్రహార్” పేరుతో 30 రోజుల పాటు నిరంతర మాదకద్రవ్యాల నిరోధక కార్యక్రమాన్ని ప్రారంభమైన తర్వాత జిల్లాలో సింథటిక్ డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడం, చిల్లర విక్రయ నెట్ వర్కులను నిర్మూలించడం, వాణిజ్య మరియు సరఫరాల గొలుసులను అంతరాయం కలిగించడం తదితర కార్యక్రమాలను ప్రత్యేక దాడులు మరియు గస్తీ చర్యలను మరింత వేగవంతం చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికను ఉపయోగించుకుని డ్రోన్ల ద్వారా మారుమూల ప్రాంతాలలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను గుర్తించి వాటిని అరికట్టేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈగల్ క్లబ్స్ ద్వారా జిల్లా లో ప్రతినెల స్కూల్లో, కాలేజీలలో అవగాహన కార్యక్రమాలను విద్యాశాఖ, పోలీస్ శాఖ వారు సమన్వయం చేసుకొని అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా మరిన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.అనంతరం డ్రగ్స్ గంజాయి నేరం, డ్రగ్స్ వద్దు స్కిల్స్ ముద్దు, డ్రగ్స్ వద్దు బ్రో, వివిధ రకాల పోస్టర్లను జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ తదితరులు ఆవిష్కరించారు

ఈ సమావేశంలో రాయచోటి ఆర్డిఓ శ్రీనివాస్, జిల్లా రవాణా శాఖ అధికారి, డీఈవో,జిల్లా అటవీ శాఖ అధికారి, ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు , డి.ఎస్.పి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: