నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో అంతర్జాతీయ మానవ హక్కుల సదస్సు అంగల్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో బుధవారం(10-12-2025) ఎన్. ఎస్. ఎస్. ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల సదస్సు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి మాట్లాడుతూ సమాజం లో ప్రతి ఒక్కరూ మానవ హక్కులు గురించి తెలుసుకొని వాటి ప్రత్యేకత ను అన్ని వర్గాల వారికీ చెప్పాలని వీటిలో అందరూ సామానులని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ టి. ఎస్. గౌస్ భాషా మాట్లాడుతూ దేశంలో మానవ హక్కులు రాజ్యాంగ పరంగా అందరికీ రావాలి అని అందరూ స్వేచ్ఛ గా జీవించాలని తెలిపారు. ఎన్. ఎస్. ఎస్. కోఆర్డినేటర్ అర్షద్ అలీ మాట్లాడుతూ ఎన్. ఎస్. ఎస్ విద్యార్థులు చదువే కాకుండా మానవ హక్కుల ద్వారా సమాజానికి మరింత సేవ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి, వైస్. ప్రిన్సిపాల్. టి ఎస్. గౌస్ బాషా, అధ్యాపకులు, ఎన్. ఎస్. ఎస్. కోఆర్డినేటర్ అర్షద్ అలీ, బి. టెక్ విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News