నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 06 : విద్యార్థి దశ నుండే విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకొని భవిష్యత్తులో చట్టం, న్యాయం, ధర్మాన్ని అనుసరించి ఆదర్శంగా నిలవాలని ఎస్ఐ టి అనిల్ కుమార్ సూచించారు. శుక్రవారం తంబళ్లపల్లి హైస్కూల్ విద్యార్థులకు పోలీస్ స్టేషన్లో చట్టాలపై అవగాహన, మహిళా చట్టాలు, ఫోక్సో చట్టం, పోలీసు కేసులు నమోదు, రోడ్డు భద్రత, సైబర్ నేరాలు తదితర అంశాలపై కూలంకషంగా అవగాహన కల్పించారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్య తో పాటు చట్టాలను గౌరవించి సన్మార్గంలో పయనించి అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో హై స్కూల్ కమిటీ చైర్మన్ శివకుమార్, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News