Friday, 31 July 2026 07:34:35 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ఆత్మ రక్షణ కోసం కరాటే విద్యను విద్యార్థినులు అభ్యసించాలి

Date : 05 November 2025 07:06 PM Views : 160

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మ రక్షణ కోసం కరాటే విద్యను విద్యార్థినులు అభ్యసించాలి - కరాటే ను అభ్యసిస్తే స్వీయ రక్షణ సాధ్యం - ప్రతి ఒక్కరు ఆత్మ విశ్వాసం తో ముందుకు సాగాలి - ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి మదనపల్లి నవంబర్ 5, (మణి నమిత విలేఖరి ) విద్యార్ధినులు ఆత్మ రక్షణ కోసం కరాటే విద్యను అభ్యసించాలని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల మరియు కళాశాల ల విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన సెల్ఫ్ డిఫెన్స్ కరాటే శిక్షణా కార్యక్రమానికి మదనపల్లి శాసన సభ్యులు యం షాజహాన్ బాషా ముఖ్య అతిధిగా హాజరై జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ప్రారంభించడం జరిగింది. బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఆత్మ రక్షణ కార్యక్రమ ప్రారంభోత్స వానికి హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా కరాటే మాస్టర్ మనిసాయి ఆధ్వర్యంలో కరాటే విద్యార్థులు చేసిన విన్యాసాలు అహుతులను, విశేషంగా విద్యార్థులను ఆకట్టు కున్నాయి. అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుంచే ఆత్మ రక్షణ కోసం కరాటే వ్యక్తిని అభ్యసించాలని సూచించారు. అనుకో కుండా ఎదురయ్యే సంఘటనలను, ఆపదలను, ఆత్మ విశ్వాసంతో ఎదుర్కోన డానికి కరాటే విద్య ఉపయోగ పడు తుందన్నారు.ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని పేర్కొన్నారు. కరాటే ను అభ్యసించడం ద్వారా స్వియ రక్షణ పొంద వచ్చునన్నారు. స్వర్గీయ కరాటే మాస్టర్ ఏఆర్ సురేష్ ఆశయ స్ఫూర్తితో మని సాయి చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే ని కరాటే మాస్టర్ మణి సాయి దుశ్యాలువ, గజ మాల తో సన్మానించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి, ఉపాధ్యాయులు కరాటే విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :