నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగం వారు మిట్స్ అల్యూమిని రిలేషన్స్ వారి ఆధ్వర్యంలో అల్యూమిని మీట్ కార్యకమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల అనుబంధం సంస్థ అభివృద్ధికి ఎంతో కీలకమని అన్నారు. అల్యూమిని విద్యార్థులు తమ ఉన్నత విద్య అనుభవాలు, ఉద్యోగ జీవిత ప్రయాణం, పరిశ్రమలోని అవకాశాలు మరియు సవాళ్లను పంచుకోవడం ద్వారా ప్రస్తుత విద్యార్థులు తమ సరైన కెరీర్ ఎంపిక చేసుకోవడంలో, అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంలో మరియు ఇంటర్వ్యూలకు సిద్ధమవడంలో సహాయపడుతుందని అన్నారు. కార్యక్రమంలో అల్యూమిని సమీర్ మరియు సుబ్రహ్మణ్యం లు మాట్లాడుతూ అల్యూమిని నెట్‌వర్కింగ్ ద్వారా విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టులు, ఉద్యోగ అవకాశాలు అలాగే ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసుకోవాల్సిన సాంకేతిక మరియు సాఫ్ట్ స్కిల్స్ గురించి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో 2007 - 2024 వరకు వివిధ బ్యాచ్‌లకు చెందిన పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై తమ విద్యా అనుభవాలు, వృత్తి ప్రయాణంలో మధుర స్మృతులను పరస్పరం పంచుకున్నారు. కార్యక్రమంలో ఇండస్ట్రీ రిలేషన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి.ఎమ్ బాలాజీ, విభాగాధిపతి డాక్టర్ ఎన్.నవీన్ కుమార్, అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి.నాగాశ్వేత, అల్యూమిని కోఆర్డినేటర్ సురేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News