Monday, 03 August 2026 06:06:26 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం!

ఎమ్మెల్యే తో రచ్చబండలో మహిళలు హామీ!

Date : 15 June 2026 09:39 PM Views : 123

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 15 : లక్షలాదిమంది భక్తుల ఆరాధ్య దైవం సంచరించిన మల్లయ్య కొండల్లో మైనింగ్ చేపడితే ఉపేక్షించేది లేదని ఘాటుగా స్పందిస్తామని మహిళలు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ముందు ధీమాగా చెప్పారు. సోమవారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పరసతోపు పంచాయతీ బోయపల్లిలో ప్రజలు, మహిళలకు అభివాదం చేస్తూ పేరుపేరునా పలకరిస్తూ రచ్చబండ చేరుకొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అందరికీ దేవుడుగా నిలిచిన మహాశివుడు స్థిరపడిన కొండల్లో ఖనిజాల అన్వేషణ చేస్తే అడ్డుకుంటామని భక్తుల మనోభావాలు దెబ్బ తినడంతో పాటు పచ్చటి పర్యావరణంతో శివార్లలోని పల్లె సీమలు బుగ్గి పాల వుతాయని కొండలను కాపాడుకోవడానికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకాతిరెడ్డి మాట్లాడుతూ శతాబ్దాల చరిత్ర కలిగిన సాధు, ఇనుము, మల్లయ్య కొండల సమాహారం దైవాంశ సంభూతమని ఇలాంటి కొండలలో మైనింగ్ చేపడితే పర్యావరణంతో పాటు భక్తుల మనోభావాలు, ఆధ్యాత్మికత,దైవత్వాన్ని, స్థానిక అచ్చులాధి భక్తుల నమ్మకాన్ని వమ్ము చేసినట్లేనని తెలిపారు. ముల్లయ్య కొండల మహా శివుని ఆలయాల సంరక్షణ కోసం పార్టీలకతీతంగా రైతులు, కూలీలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు,శివ భక్తులు, ప్రజలు ప్రతి ఒక్కరు వ్యతిరేకించక తప్పదన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వాలు పవిత్రమైన మల్లయ్య కొండల జోలికి రాకుండా శాశ్వత మైనింగ్ రహిత ప్రాంతంగా ప్రకటించి మల్లయ్య కొండల అభివృద్ధికి సహకరించి లక్షలాదిమంది సేవించే ఆ మల్లయ్య కొండ మహాశివుని భక్తుల మనోభావాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు. ఆయన వెంట మహిళలు, గ్రామీణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: