Thursday, 30 July 2026 06:52:35 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

నృత్య,గాన సృజనాత్మకతను వెలికితీయడమే తమ లక్ష్యం - థిల్లానా కల్చరల్ సొసైటీ వ్యవస్థాపకులు వెంకటేష్ స్పష్టం

Date : 03 April 2026 05:44 PM Views : 175

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నృత్య,గాన సృజనాత్మకతను వెలికితీయడమే తమ లక్ష్యం - థిల్లానా కల్చరల్ సొసైటీ వ్యవస్థాపకులు వెంకటేష్ స్పష్టం - ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు - హాజరైన ట్రాఫిక్ సిఐ గురునాథ్,కలికిరి సీఐ అనిల్ కుమార్ మదనపల్లె : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె నందు థిల్లానా సాంస్కృతిక సంస్థ టాలెంట్ ఎక్స్పో పేరుతో డాన్స్,పెయింటింగ్,సింగింగ్ విభాగాలలో జిల్లాస్థాయి సాంస్కృతిక పోటీలను నిర్వహించింది.దీనికి పిల్లల నుండి మంచి స్పందన లభించింది.శుక్రవారం స్థానిక సొసైటీ కాలనీలో శ్రీ గుడ్ విల్ కంప్యూటర్స్ నందు మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మదనపల్లె ట్రాఫిక్ సిఐ గురునాథ్,కలికిరి సిఐ అనిల్ కుమార్,హెడ్ కానిస్టేబుల్,ప్రముఖ వ్యాఖ్యాత రామ్మూర్తి,థిల్లానా కల్చరల్ సొసైటీ ఫౌండర్ వెంకటేష్,ఉపాధ్యాయుడు బి.వి రమణ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వర్తమాన కాలంలో పిల్లలు సెల్ ఫోన్లకు అలవాటు పడివారిలో వున్న ప్రతిభను మరచితున్నారని గుర్తుచేశారు.వాటి నుండి వారిని దూరం చేయాలనే సదుద్దేశ్యంతో నిర్వహించిన థిల్లానా టాలెంట్ ఎక్స్పోలో పాల్గొని ప్రతిభను చాటి చెప్పిన పిల్లలను అభినందించారు.చెడు వ్యసనాలకు విద్యార్థులు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు.చిన్నతనం నుండే దేశభక్తి సామాజిక స్పృహను,పెంపొందించుకొని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.గుడ్ విల్ కంప్యూటర్స్ వేదికగా థిల్లానా వ్యవస్థాపకుడు వెంకటేష్ ను ప్రసంశించారు.పిల్లలంతా చదువుతో పాటు కలలు,క్రీడలపైన ఆసక్తిని పెంచుకొని రాణించాలని సూచించారు.థిల్లానా కార్య నిర్వాహకులు నాగరాజ్,సురేష్,దిలీప్,జస్వంత్ లు మాట్లాడుతూ థిల్లానా టాలెంట్ ఎక్స్ పోలో మదనపల్లె,గాలివీడు,నూలివీడు,పుంగనూరు ప్రాంతాల నుండి విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు.పిల్లలలో దాగి వున్న ప్రతిభను వెలికితీయడంలో అవకాశాలు కల్పించడంలో థిల్లానా ఎప్పుడు ముందుంటుందని పేర్కొన్నారు.అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాలు,సాంస్కృతిక కార్యక్రమాల ప్రోత్సాహానికి తనవంతు సహకారం అందిస్తున్న శ్రీ గుడ్ విల్ కంప్యూటర్స్ అధినేత విజయ్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం ముఖ్య అతిథులు చేతుల మీదుగా విజేతలకు ప్రథమ,ద్వితీయ బహుమతులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు,శ్రీ గుడ్విల్ కంప్యూటర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: