Thursday, 30 July 2026 04:17:58 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

"ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లాలి - టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు

Date : 27 July 2026 02:51 PM Views : 25

నమిత న్యూస్ - Andhra Pradesh / Vishakhapatnam : విశాఖపట్నం - జూలై 27 : ఎన్డీయే కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రతి కుటుంబానికి చేరవేసే లక్ష్యంతో చేపట్టిన "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గాజువాక నియోజకవర్గంలోని 65వ వార్డు బీసీ రోడ్ పరిధిలో ఘనంగా శ్రీకారం చుట్టారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. సభ అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లిన పల్లా శ్రీనివాసరావు ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు, పేద కుటుంబాలకు అందించిన ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. అలాగే ప్రభుత్వ ప్రగతి నివేదికను అందజేస్తూ, వారి సూచనలు, సమస్యలను స్వయంగా నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా 40 రోజుల పాటు నిర్వహించే "2 ఏళ్ల నమ్మకం... అభివృద్ధి, సంక్షేమం" ఇంటింటి ప్రచార కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విజయాలను ప్రజలకు నేరుగా వివరించడం, లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడటం, వారి అభిప్రాయాలను నమోదు చేయడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

ప్రతి నాయకుడు, కార్యకర్త ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడాలని, ప్రతి ఇంటి వద్ద సమయం కేటాయించి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని సూచించారు. ప్రభుత్వం రూపొందించిన ప్రగతి నివేదికను ప్రజలకు అందించడంతో పాటు, అభివృద్ధి, సంక్షేమంపై రూపొందించిన ప్రచార వీడియోలను కూడా చూపించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సహకారం, మిత్రపక్షాల సమన్వయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధిని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పల్లా పిలుపునిచ్చారు. సూపర్-6 హామీల అమలు, మహిళలు, రైతులు, యువత, విద్యార్థులకు అందుతున్న సంక్షేమ ఫలాలు, రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గత ఐదేళ్ల విధ్వంసకర పాలనకు, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, పారదర్శక పాలనకు మధ్య ఉన్న స్పష్టమైన తేడాను ప్రజలకు తెలియజేయాలని అన్నారు. ప్రజల సమస్యలు, సూచనలను నమోదు చేసి వాటి పరిష్కారానికి పార్టీ, ప్రభుత్వం తరఫున కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ప్రతి బూత్ పరిధిలోని ప్రతి ఇంటిని క్రమబద్ధంగా సందర్శిస్తూ ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం కావాలని, ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించాలని, మై టీడీపీ (MyTDP) యాప్ ద్వారా ప్రజల స్పందనను నమోదు చేస్తూ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని పల్లా సూచించారు. ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని, ప్రతి కార్యకర్త పార్టీ ప్రతినిధిగానే కాకుండా ప్రభుత్వం చేసిన మేలుకు రాయబారిగా పని చేయాలని పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధి గాథను ప్రతి గడపకు చేరవేయాలని ఆయన కోరారు

ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గ పరిశీలకుడు కిడారి శ్రావణ్ మరియు మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, కార్యదర్శులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :