Thursday, 30 July 2026 08:18:21 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

దళితులపై దౌర్జన్యం,కులం పేరుతో దూషణలు, భౌతిక దాడులు, పోలీసులకు ఫిర్యాదు

Date : 30 December 2025 05:50 PM Views : 242

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట - డిసెంబర్ 30: దళితులపై దాడి,న్యాయ పోరాటానికి మద్దతు తెలిపిన బహుజన సేన - రాష్ట్ర అధ్యక్షులు శ్రీచందు మండల కేంద్రమైన కురబలకోట లో కుల వివక్ష, దౌర్జన్యం చోటుచేసుకున్నాయి. ఎస్సీ కాలనీకి వెళ్లే దారిని అడ్డుకోవడమే కాకుండా, ప్రశ్నించిన దళిత ఆటో డ్రైవర్‌పై కులం పేరుతో దూషణలకు దిగి భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితుడు మదనపల్లి సబ్ డివిజనల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ​ఘటన వివరాలు: కురబలకోట ఎస్సీ కాలనీకి చెందిన A. గంగాధర్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. ఈ నెల 28వ తేదీ రాత్రి పని ముగించుకుని తన ఆటోలో ఇంటికి వెళ్తుండగా, స్థానిక బస్టాండ్ పక్కన ఉన్న పొడవు అబ్దుల్ అనే వ్యక్తి పెద్ద పెద్ద బండరాళ్లను దారికి అడ్డుగా వేశాడు. ఆటో వెళ్లడానికి వీలు లేకపోవడంతో గంగాధర్ దీనిపై ప్రశ్నించగా, అబ్దుల్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ​కులం పేరుతో దూషణలు - భౌతిక దాడి: "మీ మాదిగ పల్లెవాళ్ళు నా ఇంటి ముందు నుంచి వెళ్లకూడదు" అంటూ అబ్దుల్ బాధితుడిని అత్యంత అసభ్య పదజాలంతో, కులం పేరుతో దూషించాడు. దారికి అడ్డుగా ఉన్న రాళ్లను తొలగించే ప్రయత్నం చేయగా, గంగాధర్‌ను కిందకు తోసేసి దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన గంగాధర్ బావమరిది శివ, స్థానికుడు శ్రీనివాసులు అడ్డుకోబోగా.. అబ్దుల్ కుమారుడు ఉమర్ కూడా వారితో కలిసి గొడవకు దిగాడు. బాధితులను పిడిగుద్దులతో కొట్టడమే కాకుండా, తాము ఆరాధించే దేవుళ్లను ఉద్దేశించి కూడా అసభ్యంగా మాట్లాడారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ​చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి: గత ఆరు నెలలుగా ఈ వేధింపులు కొనసాగుతున్నాయని, ఆ దారి గుండా వస్తే "నరుకుతాం" అని నిందితులు బహిరంగంగా బెదిరిస్తున్నారని గంగాధర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎస్సీ కాలనీకి వెళ్లే ప్రధాన దారిని అడ్డుకుంటూ, దళితులపై నిరంతరం దౌర్జన్యానికి పాల్పడుతున్న పొడవు అబ్దుల్ మరియు అతని కుమారుడు ఉమర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులను డిమాండ్ చేశాడు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :