Thursday, 30 July 2026 10:45:36 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

పడకగదికి సీసీ కెమెరా అమర్చారని ఎస్పీకి ఫిర్యాదు

Date : 23 June 2026 10:08 AM Views : 154

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె టౌన్ : తన పడకగదిలో జరిగే వ్యక్తిగత విషయాలను చిత్రీకరించేలా సీసీ కెమెరా ఏర్పాటు చేశారని, ఆ వీడియోలను సెల్‌ఫోన్ల ద్వారా ఇతరులకు పంపిస్తూ పరువు తీస్తున్నారని ఓ బాధితుడు జిల్లా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశాడు. మదనపల్లె మండలం పోతబోలు గ్రామంలోని భూమకంవారిపల్లికి చెందిన భాస్కర్ సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)లో హాజరై వినతిపత్రం అందజేశాడు. తన ప్రత్యర్థులైన గంగులప్ప, జయలక్ష్మి తన నివాసంలోని పడకగదిని లక్ష్యంగా చేసుకుని సీసీ కెమెరా అమర్చారని, అందులో రికార్డైన దృశ్యాలను సెల్‌ఫోన్ల ద్వారా బహిర్గతం చేస్తూ తన గోప్యతకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించాడు. అంతేకాకుండా, తన భార్యతో ఉన్న వ్యక్తిగత క్షణాలను కూడా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసి గ్రామంలో అవమానానికి గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఎస్పీని కోరాడు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :