Friday, 31 July 2026 02:33:07 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

పీలేరు ను రెవిన్యూ డివిజన్ కేంద్రం గా ఏర్పాటు అవుతోందని కూటమి శ్రేణుల సంబరాలు

ఫలించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి కృషి

Date : 25 November 2025 08:34 PM Views : 248

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - నవంబర్ 25 : ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక మదనపల్లి జిల్లా తో పాటు పీలేరు ను రెవెన్యూ డివిజన్ కేంద్రం గా చేస్తారని కాబినెట్ సబ్ కమిటీ తీర్మానం తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు కూటమి శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. గుర్రంకొండ బస్టాండ్ కూడలిలో బాణ సంచాలు పేల్చి చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల్లో మదనపల్లి, పీలేరు, పుంగనూరు తంబళ్లపల్లి నియోజకవర్గ ప్రజలకు అనుకూలంగా ఇచ్చిన హామీలు నెరవేర్చారని అన్నారు. మదనపల్లి జిల్లా తో పాటు పీలేరు ను రెవెన్యూ డివిజన్ కేంద్రం అవడం కోసం పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు పలుసార్లు విన్నవించడం తోపాటు అసెంబ్లీ లో సైతం తన బాణిని వినిపించారని, అహర్నిశలు ఆయన చేసిన కృషి ఫలించిందని, పీలేరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలే పరమాదిగా పని చేస్తున్న ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కి కూటమి శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, అనుబంధ సంఘాలు, నల్లారి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :