నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె – అన్నమయ్య జిల్లా రాయల్ యూత్ సొసైటీ రాయల్ యూత్ సొసైటీకి చెందిన నాయకులు రేగడి ప్రసాద్ కుమార్, ముని గోపాలకృష్ణ , రాయల్ గని , జయరాం , వేణ్మన్న గ, కొండయ్య వరప్రసాద్ , చంద్రశేఖర్ వెంకటేశ్ , రామచంద్ర , చక్రి ** కలిసి చేసిన ప్రకటన ప్రకార తెలుగు జాతికి శాశ్వత కీర్తి తీసుకువచ్చిన అఖండ భారత దేశ చక్రవర్తి, సాహిత్య–సంస్కృతి సంపదను ప్రపంచానికి పరిచయం చేసిన మహామహుడు శ్రీ శ్రీకృష్ణదేవరాయులు గారి పేరును మదనపల్లె జిల్లాకు అధికారిక నామకరణంగా ప్రకటించాలి అని ప్రభుత్వాన్ని వినమ్రంగా అభ్యర్థిస్తున్నాము. రాయలసీమ చరిత్రలో అపూర్వ ప్రతిభ కనపరిచిన ఈ మహారాజు పేరు, కొత్తగా ఏర్పడిన మదనపల్లె జిల్లాకు అత్యంత సముచితమైనదని మా అభిప్రాయం. తెలుగు ప్రజలు, రాయలసీమ వాసులు, ముఖ్యంగా బలిజ సామాజిక వర్గం తరఫున కూడా ఈ డిమాండ్‌కు విశేషమైన మద్దతు లభిస్తున్నది. మదనపల్లె ప్రాంత అభివృద్ధి, చరిత్ర, సంస్కృతికి తగిన గౌరవం దక్కేలా “శ్రీకృష్ణదేవరాయుల జిల్లా” పేరును ప్రభుత్వం ప్రకటించాలని రాయల్ యూత్ సొసైటీ బలంగా కోరుచున్నది. — రాయల్ యూత్ సొసైటీ అధ్యక్షులు : రేగడి ప్రసాద్ కుమార్, మదనపల్లె
Reporter
Namitha News