Thursday, 30 July 2026 10:31:10 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు

Date : 06 June 2026 07:28 PM Views : 129

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్స 06 : మదనపల్లి పట్టణం సమీపంలోని అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్) విభాగం ఆధ్వర్యంలో బి.టెక్ మొదటి సంవత్సరం డేటా సైన్స్‌కు చెందిన 90 మంది విద్యార్థులు మరియు అధ్యాపకుల బృందం కలిసి ఇండస్ట్రియల్ విజిట్‌లో భాగంగా బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఐ.టి సంస్థ అయిన మైక్రోసాఫ్ట్ కంపెనీని సందర్శించారు అని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు . విద్యార్థులకు పరిశ్రమ అనుభవం మరియు పరిశోధనలపై అవగాహన అందించడమే ఈ విజిట్ ప్రధాన లక్ష్యంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు నాన్సీ రవాలియా మరియు పృథ్వి ఎస్ లు డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు (AI), క్లౌడ్ టెక్నాలజీలు వంటి తాజా సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహన మరియు ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. అలాగే మైక్రోసాఫ్ట్ సంస్థలో కొనసాగుతున్న పరిశోధనలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా అనలిటిక్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాల్లో మైక్రోసాఫ్ట్‌లో విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థులు నూతన జెనెరేటివ్ ఏ.ఐ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకొని , భవిష్యత్ కెరీర్‌కు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్.ఎం. కిరణ్ కుమార్, మంజుల, విద్య శ్రీ మరియు భార్గవ కృష్ణ ల అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :