Thursday, 30 July 2026 10:28:32 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

భూ వివాదంతో ఉద్రిక్తత, ఇరువర్గాలపై కేసులు నమోదు

ఇరువర్గాలను తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేసిన యస్.ఐ. రమేష్ బాబు

Date : 11 November 2025 11:45 PM Views : 181

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్11 : రామసముద్రం మండలం, అరికెల పంచాయతీలోని చిట్టెం వారి పల్లి, కమ్మవారిపల్లె లలో ఎస్సై రమేష్ బాబు మంగళవారం రెండు గ్రామ పంచాయతీలలో పర్యటించి భూసమస్యలకు సంబందించిన ఇరువర్గాలకు పరస్పర అవగాహన కల్పించారు. భూమి వివాదంలో ఉద్రిక్తత చోటుచేసుకుని రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా సాగుతున్న విభేదాలు ఇటీవల తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో కేసు, కౌంటర్ కేసులు రామసముద్రం పోలీస్ స్టేషన్‌లో నమోదయ్యాయి. శాంతిభద్రతలు కాపాడడంలో భాగంగా, నేడు ఇరు వర్గాల నలుగురిని రామసముద్రం మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. రెండు ఘటనలకు సంబందించిన భూ సమస్యలపై ఎస్సై రమేష్ బాబు మాట్లాడుతూ భవిష్యత్తులో శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడరాదని, గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొనేలా సహనం, అవగాహనతో వ్యవహరించాలని గ్రామస్తులను ఆయన హెచ్చరించారు.ఏవైనా సమస్యలు ఉంటే మాదృష్టికి, రెవిన్యూ అధికారులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్ బాబు, సిబ్బంది భరత్ రెడ్డి రైతులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :