Thursday, 16 April 2026 03:08:31 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

ముద్దలదొడ్డి చెరువులకు హంద్రీనీవా జలాల కోసం సర్వే

Date : 13 April 2026 09:06 PM Views : 161

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 13 : తంబళ్లపల్లె మండలం లోని బాలిరెడ్డిగారిపల్లి(ముద్దలదొడ్డి) పంచాయితీ లోని చెరువులకు హంద్రీనీవా జలాలు పంపిణీకి హెచ్ ఎన్ ఎస్ ఎస్ ఎఈ అనిల్ కుమార్ సోమవారం ముమ్మరంగా సర్వే నిర్వహించారు. ఈ ఏడాది మార్చి23వ తేదీన బాలిరెడ్డిగారి పల్లి పంచాయతీలో భూగర్భ జలాలు అడుగంటి తాగునీరు, సాగునీరు లేక చెరువులు, బోర్లు ఎండిపోతున్నాయని గ్రీవెన్స్ డే లో పంచాయితీకి చెందిన సి.ఎ ఆడిటర్ ఎం.దామోదర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు అందాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఎఈ అనిల్ కుమార్ బి.కొత్తకోట మండలం గోల్లపల్లి హంద్రీనీవా కెనాల్ నుండి బాల్ రెడ్డి గారి పల్లి పంచాయతీలోని ముద్దిరెడ్డి చెరువు,జన్నెచెరువు, రాచెరువు నుండి అప్పిరెడ్డి చెరువు వరకు సర్వే నిర్వహించారు. పంచాయతీలో భూగర్భ జలాలు అడుగంటి తాగునీరు, చెరువులు, వ్యవసాయ బోర్లు ఇంకిపోతున్నాయని హంద్రీనీవా జలాలు పంపిణీ చేయాలని రాజంపేట పార్లమెంట్ రైతు సంఘ నాయకుడు వెంకట్ రెడ్డి ఎఈని కోరగా ఆయన సర్వే నివేదికలను ఉన్నతాధికారులు పంపించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయమై హంద్రీనీవా ఎఈ నిర్వహించిన సర్వేతో మండలంలోని బాలి రెడ్డి గారి పల్లి పంచాయతీలో ప్రజలు హర్షం వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :