నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఫిబ్రవరి 22 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు సివిల్ ఇంజనీరింగ్ విభాగం వారు మిట్స్ అమెరికన్ సొసైటీ అఫ్ సివిల్ ఇంజనీర్స్ స్టూడెంట్స్ చాప్టర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, కడప వారి ఆధ్వర్యంలో “కాలుష్య నియంత్రణ – మనందరి బాధ్యత” అనే అంశంపై అవగాహన కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కాలుష్య నియంత్రణ మండలి కడపకు చెందిన పర్యావరణ ఇంజనీర్ శ్రీమతి కె. సుధ పాల్గొన్నారు.కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా ప్రతి ప్రాంతంలో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాన్ని ప్రతి నెల మూడవ శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కాలుష్య నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయని, ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం మరియు రీసైక్లింగ్ ప్రక్రియలను ప్రోత్సహించడం ద్వారా కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు. సాంకేతికంగా అభివృద్ధి చెందడం ఎంత ముఖ్యమో, అంతే బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ పట్ల విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కాలుష్యం పెరిగితే అనేక వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, కరోనా వంటి మహమ్మారులు కూడా పర్యావరణ అసమతుల్యతకు ఉదాహరణలని అన్నారు. విద్యార్థులకు శబ్ద కాలుష్యం, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం వంటి వివిధ రకాల కాలుష్యాల వల్ల కలిగే హానికర ప్రభావాల పై అవగాహన కల్పించి, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీన్-స్కూల్ అఫ్ కంప్యూటింగ్ డాక్టర్ దీపాంకర్ రాయ్, విభాగాధిపతి డాక్టర్ విజయ్ కుమార్ నటేశన్, డాక్టర్ ఏ.వి పవన్ కుమార్, యూనివర్సిటీ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Admin
Namitha News