నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 20 : అన్నమయ్య జిల్లా పెద్దకురప్పల్లె గ్రామ పంచాయతీ సచివాలయం లో గురువారం వారం సర్పంచ్ రెడ్డెప్ప నాయుడు అధ్యక్షతన మండల డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్ ఏ గఫూర్ ఆధ్వర్యంలో స్వామిత్ర గ్రామసభ నిర్వహించడం జరిగింది.సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం నేను ఎల్లప్పుడూ ఉంటానన్నారు, పంచాయతీ ఏదరయ్యే సమస్యలకు తక్షణమే స్పందిస్తానని, ప్రజావసరాల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటాననీ హామీ ఇచ్చారు. గ్రామస్థులు కూడ తమ సమస్యలు అభిప్రాయాలను అధికారులు, ప్రజా ప్రతినిధులసమక్షంలో వెళ్ళడించారు. టిడిపి సీనియర్ నాయకులు వెంకటరమణారెడ్డి, రెడ్డి శేఖర్ మాట్లాడుతూ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సి.ఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవతో పెద్దకురప్పల్లె గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. ఇటువంటి స్వామిత్వ పంచాయతీ రాజ్ గ్రామ ఈ గ్రామసభలో గ్రామ సభలు భవిష్యత్తులో గ్రామాభివృద్ధికి మార్గదర్శకాలు అవుతాయని గ్రామపంచాయతీ ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తామన్నారు. డిప్యూటీ ఎంపిడిఓ గఫుర్ మాట్లాడుతూ పంచాయతీ పరిధిలోని ఇంటి యజమానులకు వారి ఇంటి ఖాళీ స్థలము మరియు ఇంటి నిర్మాణంతో కొలతలు తీసి నోటీసులు పంపిణీ చేసి వాటిలో గల కొలతలు సరిచూసుకొని ఏవైనా అభ్యంతరములు ఉంటే గ్రామసభలో రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు. గ్రామ ప్రజలకు అభ్యంతరములను స్వీకరించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో గపూర్ పంచాయతీ సెక్రటరీ సాకేమ్మ,సర్పంచ్ రెడ్డెప్పనాయుడు, టిడిపి సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ లు వెంకటరమణారెడ్డి, రెడ్డిశేఖర్, ఆకుల శివ,వి ఆర్ ఏ హరి సచివాలయ సిబ్బంది రెడ్డిశేఖర్, శ్వేత, సురేంద్ర దేవన్న, తలారీ అమర, మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News