నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్ 10 : విజయనగర సామ్రాజ్యాన్ని సువర్ణయుగంగా మార్చిన మహానుభావుడు శ్రీ శ్రీకృష్ణదేవరాయులు స్మరణార్థం, వారి పాలనలో ప్రముఖ స్థానం కలిగిన మదనపల్లి, తంబళపల్లి, పుంగనూరు, పిలేరు ప్రాంతాలు, చారిత్రకంగా మరియు సాంస్కృతికంగా విజయనగర మూలాలు కలిగిన పుణ్యభూములు. అదే విధంగా, ఈ నాలుగు నియోజకవర్గాలలో సుమారు 2 లక్షలమంది బలిజ సోదరులు (వోటర్లు) నివసిస్తున్నారు. తెలుగు జాతికి ప్రతిష్టత తెచ్చిన, సాహితీ సమ్రాట్, పరిపాలనా ప్రథముడు అయిన శ్రీ శ్రీకృష్ణదేవరాయులు పేరుతో ఈ ప్రాంతాన్ని శ్రీ శ్రీకృష్ణదేవరాయుల జిల్లా గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలన్న ప్రజల ఆకాంక్షను వ్యక్తం చేయడానికి, సోమవారం మదనపల్లి బలిజ బంధువుల ఆధ్వర్యంలో పెద్ద ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేగడి ప్రసాద్ కుమార్, మునిరత్నం, ముని గోపాలకృష్ణ, జింక చలపతి, ధనలక్ష్మి, జయరాం, జనసేన రాయల్ గని, వరప్రసాద్, చంద్రశేఖర్, అర్జున్, రెడ్డమ్మ, వినోద్, చంద్ర, శివ, వేమన్న, శ్రీదేవి, వేమన నారాయణ, వెంకటేష్, కొండయ్య, చిన్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News