Monday, 03 August 2026 06:06:30 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

టీనేజీ ఆడపిల్లల నడవడికపై తల్లిదండ్రులూ నిఘా ఉంచండి - యస్.ఐ. అనిల్ కుమార్.

Date : 25 April 2026 09:46 PM Views : 163

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 25 : టీనేజీ ఆడపిల్లల నడవడికలపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని ఎస్సై టి అనిల్ కుమార్ హెచ్చరించారు. శనివారం ఐకెపి కార్యాలయంలో గంగాధర్ ఆధ్వర్యంలో మహిళా చట్టాలు,సైబర్ నేరాల అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మహిళలు చట్టాలపై అవగాహనతో పాటు బాధ్యతాయుతమైన ప్రవర్తన పెంపొందే లక్ష్యంగా సహకరించాలన్నారు. ఫోక్సో చట్టం పై అవగాహన పెంచుకోవాలన్నారు. మహిళలు తమ పిల్లల భద్రత కోసం శక్తి యాప్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. శక్తి టీం సభ్యులు బి.ముని కుమార్ నాయక్, శశికళ లు టీనేజీ వయసులో ఆకర్షణలకు నియంత్రించకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు, వాటికి సంబంధించిన కేసు స్టడీస్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, సెల్ ఫోన్ల ద్వారా జరుగుతున్న మోసాలు మరియు వాటి పట్ల అప్రమత్తత, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వల్ల జరిగే దుష్ప్రభావాలు, మహిళలు మరియు పిల్లల భద్రత కోసం అందుబాటులోకి వచ్చిన శక్తి యాప్ ఉపయోగాలు వివరించి అత్యవసర సహాయం కోసం 1930,112,1098 టోల్ ఫ్రీ నెంబర్లకు సంప్రదించాలన్నారు. మహిళలు చదువు ద్వారా వ్యక్తిగత స్థాయి పెరగడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు గురి చేయకుండా బాధ్యతగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ రమణమ్మ, ఎస్ఐ నజీర్ భాష, టిడిపి నాయకులు బేరి శ్రీనివాసులు, పురుషోత్తం, కసెట్టి వెంకటరమణ, సీసీలు కత్తి నరసింహులు, రమణ, పోలీస్ సిబ్బంది, అంగన్వాడీలు, ఐకెపి మహిళలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :