Friday, 31 July 2026 12:42:06 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

వైసీపీ నాయకుల భూ దోపిడీలో మోసపోయాం..

భాగ్యనగర్ పేరుతో ఏర్పాటు చేసిన వెంచర్ లో జరిగిన. రూ 100 కోట్ల భూ దోపిడి పై వెంటనే చర్యలు తీసుకోవాలి. వైసీపీ నాయకుల అండతో సీనియర్ సిటిజన్స్ స్థలాల ఆ

Date : 17 November 2025 06:16 PM Views : 263

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్ 17: మదనపల్లి రూరల్ మండలం, పోతబోలు గ్రామపంచాయతీ, సర్వే నెంబర్ 153లో జరిగిన రూ 100 కోట్ల భూ దోపిడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిలికు విన్నవించారు. సోమవారం రాయచోటి లోని జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు భూ బాధితులు నారాయణస్వామి, వరప్రసాద్, లత, మల్లికార్జున శెట్టి, ఇషాక్, మహల్ బాప్ జాన్, త్యాగరాజు, రెడ్డప్ప, వెంకటరమణ, పలువురు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాగ్యనగర్ రియల్ ఎస్టేట్ పేరుతో గత 15 ఏళ్ల కిందట పోతబోలు గ్రామపంచాయతీలో సర్వే నెంబర్ 153లో 3.54 ఎకరాల స్థలంలో కొందరు వెంచర్ వేసినట్లు తెలిపారు. ఈ వెంచర్ లో మొత్తం 192మంది కంతుల ప్రకారం ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. అప్పుడు ఎవరికి కావాల్సిన ఇళ్ల స్థలాలను భాగ్యనగర్ వెంచర్లో కేటాయించినట్లు తెలిపారు. గత వైసిపి ప్రభుత్వంలో బాబ్ జాన్, నిజాముద్దీన్, కృష్ణప్ప, నాగరాజు అనే వ్యక్తులు వెంచర్ లో వేసిన రాళ్లను తొలగించి, మొత్తం స్థలాన్ని చదును చేసి వ్యవసాయ భూమిగా మార్చి ఫెన్సింగ్ వేశారని తెలిపారు. వీరే ఆ భూమి తమదే అని వారి ఆధీనంలో ఉంచుకున్నట్లు వెల్లడించారు. మొత్తం 192 మంది కొనుగోలుధారులు ఈ స్థలాలపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారని, అక్కడికి వెళ్లిన భూ బాధితులను బెదిరిస్తున్నట్లు వాపోయారు. ఇప్పుడు ఇదే స్థలాల పక్కనే నేషనల్ హైవే రోడ్డు వెళ్ళిందని, అక్కడ కుంట స్థలం రూ. 30 లక్షల వరకు ధర పలుకుతున్నట్లు పేర్కొన్నారు. ప్లాట్లు కొన్నవారికి స్థలాలు చూపకుండా అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం చెందారు. అక్కడికి వెళ్లిన వారిని బెదిరించి బయటకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఎవరైతే స్థలాలు కొన్న భూ యజమానులు, వారి కుటుంబ సభ్యులు రిజిస్ట్రేషన్ పత్రాలు తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోతున్నట్లు తెలిపారు. ఇందులోని 1.25 ఎకరాల భూమిని చదరపు గజములతో విక్రయం చేసి, వారి అనుభవంలో ఉంచుకున్నట్లు చెప్పారు. తమకు న్యాయం చేయాలని మదనపల్లి తహసీల్దార్ కు విన్నవించడం జరిగిందన్నారు. కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్ పత్రాలను, ప్లాట్ల నెంబర్లను కూడా జత చేసి రెవిన్యూ అధికారులకు అందించినట్లు తెలియజేశారు. స్పందించిన రెవెన్యూ అధికారులు ఆగస్టు 30న ఆ స్థలంలో నోటీసు బోర్డు పెట్టారని, నాగరాజు అనే వ్యక్తి నోటీసు బోర్డును తొలగించి దౌర్జన్యం చేస్తున్నట్లు తెలిపారు. ఇతన్ని ప్రశ్నించిన స్థల కొనుగోలుధారులు పై క్రిమినల్ కేసులు పెడతామని, చంపివేస్తామని బెదిరింపులకు దిగుతున్నట్లు ఆగ్రహించారు. వీరిపై తమకు ప్రాణహాని ఉందని మదనపల్లి తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అక్కడ స్థలం రాదని మనోవేదనకు గురైన శంకర్ అనే వ్యక్తి మృతి చెందారని తెలియజేశారు. సంబంధిత రెవిన్యూ అధికారులు రికార్డులు సమగ్రంగా పరిశీలించి ఆ భూమి తనది అంటున్న షేక్ జావిద్ పైన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన వారికి న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ను కోరారు. స్పందించిన ఎస్పీ మదనపల్లి డిఎస్పి వద్దకు వెళ్లి మీ సమస్యను తెలపాలని సూచించారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: