నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - జనవరి 02: గుర్రంకొండ మండలం సంగసముద్రం గ్రామంలో జరిగిన గ్రామ రెవిన్యూ సదస్సు లో నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం లో అన్నమయ్య జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సదస్సు లో రైతులకు ఆధునాతన సాంకేతికతో రూపొందించిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వే జరిగిన గ్రామాలలో పట్టాదారు పాసుపుస్తకాలపై బొమ్మలను తీసివేసి రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని కలిగిన పట్టాదారు పాసు పుస్తకాలను రెవెన్యూ గ్రామసభలలో పంపిణీ చేయనున్నారని పేర్కొన్నారు. రీసర్వే ద్వారా పలు రెవిన్యూ, భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికిందన్నారు. నూతన పాసు పుస్తకాలలో తప్పులు దొర్లితే అర్జీ పెట్టుకొని వెంటనే సమస్యను పరిష్కరించుకోవచ్చని ప్రజలకు తెలియచేసారు
ఈ రెవిన్యూ సదస్సులో మండలం లోని రెవిన్యూ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Reporter
Namitha News