Thursday, 30 July 2026 06:10:51 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఏ రాజకీయ నాయకుడు మా గ్రామానికి రావొద్దు ...

పెద్ద హరివాణం గ్రామస్తుల హెచ్చరిక ....

Date : 05 January 2026 11:32 AM Views : 331

నమిత న్యూస్ - Andhra Pradesh / Kurnool : ఆదోని - జనవరి 05 : తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని పెద్ద హరివాణం గ్రామస్తుల నిరసన గత కొద్ది రోజులుగా రిలే దీక్షలు నిర్వహిస్తున్న గ్రామస్తులు తాజాగా ఏ రాజకీయ నాయకుడు మా గ్రామానికి రావద్దు అంటూ బోర్డు ఏర్పాటు చేసిన వైనం కర్నూలు జిల్లా, ఆదోని -2 మండలంలోని పెద్ద హరివాణం గ్రామస్తులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించేంత వరకు ఏ రాజకీయ నాయకుడినీ గ్రామంలో అడుగు పెట్టనివ్వకూడదని గ్రామస్తులంతా తీర్మానించారు. ఈ మేరకు ఆదివారం గ్రామ సరిహద్దులో బోర్డును ఏర్పాటు చేసి తమ నిరసనను తెలియజేశారు. రాష్ట్రంలోనే అతిపెద్ద మండలమైన ఆదోని మండలాన్ని నాలుగు మండలాలుగా విభజించాలని గత సంవత్సరం నుండి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. శాసనసభలో ఈ అంశంపై ప్రస్తావించారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా పెద్ద హరివాణం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ గ్రామస్థులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయితే, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదోని మండలాన్ని రెండు మండలాలుగా విభజిస్తూ ఆదోని, పెద్ద హరివాణం మండలాలుగా ప్రకటించింది. ఇందులో ఆదోని మండలంలో 24 గ్రామాలు, పెద్ద హరివాణం మండలంలో 22 గ్రామాలను కేటాయించింది. అయితే 16 గ్రామాల ప్రజలు .. పెద్ద హరివాణం మండల కేంద్రంలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ దీక్షలు చేయడంతో ప్రభుత్వం వెనకడుగు వేసి పెద్ద హరివాణం మండలం కాకుండా ఆదోని - 1, ఆదోనీ -2 మండలంగా ప్రకటించింది. ఈ నిర్ణయంపై పెద్ద హరివాణం గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గత వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఆందోళనలో భాగంగా ఆదివారం గ్రామానికి చెందిన పలువురు మండల కేంద్రం ఏర్పాటు కోసం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మండల సాధన కమిటీ అధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి, మధులు మాట్లాడుతూ.. తమ గ్రామాన్ని మండలంగా ప్రకటించి గెటిజ్ నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు ఆదోని - 1, ఆదోనీ -2 మండలాలుగా ప్రకటించడం దారుణమన్నారు. నాయకులు తమను, తమ గ్రామాన్ని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఏ పార్టీ రాజకీయ నాయకులు తమ గ్రామంలోకి రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. తిరిగి మండల కేంద్రంగా ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని పేర్కొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :