నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 27 : సచివాలయాల పరిధిలోని పంచాయతీలలో అధికారులు ఇంటి పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలని స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన అధికారులతో సమీక్ష జరిపి పంచాయతీలలో అభివృద్ధి పనుల నిర్వహణతో పాటు పన్ను వసూలు జరిగితే అభివృద్ధి రెట్టింపు అవుతుందని సూచించారు. పంచాయతీల ఆదాయ వనరులపై దృష్టి సారించి నేటి ప్రభుత్వ అభివృద్ధి పనులకు పంచాయతీ నిధులు తోడైతే గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటాయన్నారు. అదేవిధంగా హౌస్ హోల్డ్ సర్వే త్వరగా పూర్తి చేయాలన్నారు.వేసవిలో తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పారిశుద్ధ్యం మెరుగు తోపాటు మౌలిక సదుపాయాలపై క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. ఈ సమీక్షలో ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవో మారుతీ కుమార్, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News