నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 28 : ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పారిశుద్ధ్యం పాటించడం బాధ్యతగా పాటించాలని ఏవో థామస్ రాజా పిలుపునిచ్చారు. శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్యంపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ పారిశుద్ధ్యం తోబాటు మరుగుదొడ్లు వాడకం ఆరోగ్యానికి శ్రేయస్కరమన్నారు. ఈ విషయమై తంబళ్లపల్లె క్రాస్ రోడ్ లో మేము వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుధ్యం, మరుగుదొడ్లు వాడుతామని అందరి చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఏ ఏ ఓ సురేష్, కార్యదర్శి శ్రీనివాసరావు, సోమశేఖర్ రెడ్డి,పద్మావతి, టిడిపి నేతలు కృష్ణమూర్తి నాయుడు, పురుషోత్తం, రామచంద్ర, బాలకృష్ణారెడ్డి, వీరాంజనేయులు, సుధాకర్, శ్రీనివాసులు పాల్గొన్నారు
Reporter
Namitha News