Friday, 31 July 2026 12:41:58 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మదనపల్లి మెడికల్ కళాశాల వద్ద ఉద్రిక్తత - టిడిపి,వైసిపి శ్రేణుల మధ్య ఘర్షణ - ఇరువర్గాలను పంపించి వేసిన పోలీసులు

Date : 24 November 2025 07:34 AM Views : 162

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి మెడికల్ కళాశాల వద్ద ఉద్రిక్తత - టిడిపి,వైసిపి శ్రేణుల మధ్య ఘర్షణ - ఇరువర్గాలను పంపించి వేసిన పోలీసులు మదనపల్లె : ఏపీలోని కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను పిపిపి విధానంలో నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది.ఈ విధానాన్ని ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి తీవ్రంగా విమర్శిస్తోంది.ఈ అంశంపై టిడిపి,వైసిపి నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు పెద్దిరెడ్డి కుటుంబంపై ఘాటు విమర్శలు చేయడమే కాకుండా పిపిపి విధానం వల్ల ఒనగూరే ప్రయోజనాలపై క్లుప్తంగా వివరించారు.దీనిపై తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి అనుచరులు కొందరు శ్రీరామ్ చినబాబుపై సవాల్ విసిరారు. పెద్దిరెడ్డి కుటుంబంపై విమర్శలు చేస్తే ఊరుకోమని అవసరమైతే కళాశాల వద్దకు కళాశాల వద్దకు వస్తామని అక్కడే తేల్చుకుందామన్నారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి అనుచరులు కొంతమంది ఆదివారం మెడికల్ కళాశాల వద్దకు చేరుకోగా విషయం తెలుసుకున్న శ్రీరామ్ చినబాబు అనుచరులు,టిడిపి శ్రేణులు అక్కడికి పెద్దఎత్తున చేరుకున్నాయి.ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న ఘర్షణలో టిడిపి శ్రేణులు,వైసిపి కార్యకర్తలపై విరుచుకుపడ్డారు.గత ఐదేళ్ల కాలంలో దాడులు,దౌర్జన్యాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతారా అంటూ ఆరోపించారు.ఇది వైసీపీ ప్రభుత్వం కాదని,రాష్ట్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వమని వైసిపి నాయకులు నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.విషయం తెలుసుకున్న పోలీసులు మెడికల్ కళాశాల వద్దకు చేరుకుని ఇరువర్గాల వారిని చెల్లాచెదురు చేశారు.టిడిపి,వైసిపీ శ్రేణులను అక్కడి నుండి పంపించి వేయడంతో వివాదం సద్దుమణిగింది.పిపిపి విధానంపై ఆరోపణలు,ప్రతి ఆరోపణలతో వైసిపి,టిడిపి నాయకులు తీవ్రవ్యాఖ్యలు చేసుకుంటున్నారు.ఇది ఇంకా ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో వేచి చూడాలి.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :