Friday, 31 July 2026 11:32:29 PM
# కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి

ఎంపి మిధున్ రెడ్డి చేసిన అభివృద్ధి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది

Date : 13 November 2025 05:01 PM Views : 101

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : ఎంపి మిధున్ రెడ్డి చేసిన అభివృద్ధి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది... అభివృద్ధికి చిరునామా రాజంపేట పార్లమెంటు -- మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ స్పష్టం -- ఎంపి మిధున్ రెడ్డి ని విమర్శించే స్దాయి మీది కాదు... ఆర్‌జె వెంకటేష్ కు కౌంటర్ ఇచ్చిన నిస్సార్ అహమ్మద్... ఎన్నో విమర్శలు చేయవచ్చు... ఒకటిన్నర సంవత్సరంలో మీరు చేసింది శూన్యం... రాజంపేట పార్లమెంటు సభ్యులు పివి మిధున్ రెడ్డి నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, చేసిన అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పేర్కొన్నారు. ‌గురువారం మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీలో కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్, పరిశీలకులు అనూష రెడ్డి హజరైనారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ రాజంపేట పార్లమెంటు సభ్యులు పివి మిధున్ రెడ్డి పై విమర్శలు చేసేవారు నియోజకవర్గ అభివృద్ధి కూడా చూడాలని హితవు పలికారు. టిడిపి నాయకులు ఆర్‌జె వెంకటేష్ మిధున్ రెడ్డి పైన విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని, వైసిపి ప్రభుత్వం హయ్యాంలో అటవీ భూముల విషయంలో మీకు సమస్య వస్తే ఎంపి ఇంటి దగ్గర కాసుకుని వుండి పనులు చేయించుకోలేదా అని ప్రశ్నించారు. ఎంపి మిధున్ రెడ్డి ని విమర్శించే స్దాయి మీది కాదని అన్నారు. మదనపల్లె నియోజకవర్గంలో మిధున్ రెడ్డి మార్క్ అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజ్, కేంద్రీయ విద్యాలయం, ఎంపి నిధులతో చేనేత భవన్, నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు, కరోన కష్టకాలంలో ఆక్సిజన్ సిలెండర్లు, ఇలా ఎన్నో మిధున్ రెడ్డి చోరవతో వచ్చాయని వివరించారు. ‌విమర్శలు చేసే ముందు చేసిన అభివృద్ధి కూడా చూడాలని సూచించారు. ‌ఎడాదిన్నర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించారు. ఒక్క రోడ్డు అయినా వేశరా అని ప్రశ్నించారు. ‌మెడికల్ కాలేజీలు పిపిపి విధానంలో చేపడితే అన్ని విధాల నష్టం చేకూరుతుందని అన్నారు.‌ ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :