నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నిమ్మనపల్లి - జూన్ 20 : నిమ్మనపల్లి మండలంలో రైతులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో పీఎం కిసాన్, అన్నదాత–సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమం ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మరియు ఏఎంసీ (వ్యవసాయ మార్కెట్ కమిటీ) ఛైర్మన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పీఎం కిసాన్ మరియు అన్నదాత–సుఖీభవ పథకాల ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సహాయం జమ కావడం వల్ల వ్యవసాయ పనులకు ఎంతో తోడ్పాటు అందుతుందని తెలిపారు. రైతులు ఆధునిక సాగు పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఏఎంసీ ఛైర్మన్ మాట్లాడుతూ రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, వాటిని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ, మండల అధికారులు, రైతులు, స్థానిక ప్రజా ప్రతినిధులు సింగల్ విండో రమణ, బహుద డ్యాం ప్రెసిడెంట్ దేవేందర్ రెడ్డి, జనసేన నిమ్మనపల్లి మండల అధ్యక్షుడు ప్రదీప్ సింగ్ వైస్ ప్రెసిడెంట్ తెలుగుదేశం మండల ప్రెసిడెంట్ తెలుగుదేశం మండల ప్రెసిడెంట్ రాజన్న AMC డైరెక్టర్ లక్ష్మీపతి లక్ష్మీపతి తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Reporter
Namitha News