Friday, 31 July 2026 09:31:34 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

రామసముద్రం లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు

Date : 26 November 2025 05:16 PM Views : 218

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 26 : రామసముద్రం మండలం లో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం తాహిసీల్దార్ మహ్మద్ అజారుద్దీన్ ఎంపిడిఓ లతీఫ్ ఖాన్ ల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి భారతరాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని దళిత సంఘం నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు, దళితసంఘనాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవం 1949 నవంబర్ 26 న భారతరాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిందని దీనిని గుర్తు చేసుకుంటూ ఈ దినాన్ని సంవిధాన్ దివాస్ గా పునాది వేసిందని, రాజ్యాంగం ప్రతి పౌరిడికి హక్కులు మాత్రమే కాకుండా కర్తవ్య బాధ్యతలను కూడ స్పష్టంగా సూచిస్తుందన్నారు. రాజ్యాంగం కేవలం ప్రభుత్వ పత్రం మాత్రమే కాదు ఇది భారతదేశ ప్రజాస్వామ్యానికి ఆత్మ, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, సోదర బావం వంటి విలువలకు మూలాధారమన్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నా తాహిసీల్దార్ మహ్మద్ అజారుద్దీన్, ఎంపిడిఓ లతీఫ్ ఖాన్,ఆర్ ఐ వసీం,డీటీ ఎం ఈ ఓ 2 ఆంజనేయులు,పలు పాఠశాల హెచ్ ఎంలు మునిస్వామి నాయక్ చిట్టిబాబు, తూర్పు పాఠశాల హెచ్ ఎం హేమలత, వెంకటరమణ నాయుడు,వెంకటా చలపతి రాజు, వి ఆర్ ఓ లు రెహ్మాన్ జగదీష్,రాంమోహన్, భార్గవి, మమత,దళిత సంఘనాయకులు మాజీ జడ్పీటీసీ శివశంకర్,ఎం ఆర్ పి యస్ రాజేష్,బాలాజీ,భాస్కర్, మెకానిక్ వెంకటేష్, శివ, నాగరాజు అంబరీష్,గంగాధర్,సత్యనారాయణ చంద్ర,సుధాకర్,ప్రశాంత్, సోము,ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: