నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి10 : ఒరిస్సా రాష్ట్రం నుండి జీవనోపాధి కోసం వచ్చిన ఓ యువకుడు బలవంతపు మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై టి అనిల్ కుమార్ వివరాల మేరకు ఒరిస్సా రాష్ట్రాం నాలాగట్ కు చెందిన మనోజ్ బిసాయి(30) నెలన్నర క్రితం జీవనోపాధి కోసం తంబళ్లపల్లెలోని ఓ వేరుసెనగ కాయల మిషన్లో కూలీగా పనికి కుదిరాడు. ఈ కోవలో అతడు పరసతోపు పంచాయతీ నాయనప్ప గారి పల్లెలో ఓ ఇంట్లో కాపురం ఉన్నాడు. సోమవారం రాత్రి తన ఇంట్లో చున్నీతో ఉరి వేసుకుని మృతి చెందాడు. తలుపు ఎంతటికి తెరవకపోవడంతో స్థానిక ప్రజలు తంబళ్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తలుపు తెరిచి చూడగా మనోజ్ బిసాయి ఉరి వేసుకుని మృతి చెందాడు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లి కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విలేకరులకు తెలిపారు
Reporter
Namitha News