నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 29 ః పారిశుద్ధ్య పనులలో భాగంగా చెత్త సేకరణలో మనము ముందున్నామని ఐ వి ఆర్ కాల్స్ వస్తే ఒకటి నొక్కాలని డిప్యూటీ ఎంపీడీవోలు ప్రసాద్, మారుతి కుమార్ లు ప్రజలకు సూచించారు. గురువారం కోసువారిపల్లి లో డిప్యూటీ ఎంపీడీవోలు, కార్యదర్శి శ్రీనివాసరావులు డంపింగ్ యార్డ్ పరిశీలించి తడి, పొడి చెత్త సేకరణ విధానం, ఎరువు తయారీ పై ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలోని పురవీధుల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని గ్రీన్ అంబాసిడర్లకు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా తాగునీటి సమస్యలు, వీధిలైట్లు పై దృష్టి సారించి ఎప్పటికప్పుడు పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పారిశుద్ధంపై ప్రజలకు అవగాహన కల్పించి పారిశుధ్యం పాటించి ఐ వి ఆర్ కాల్స్ వస్తే ఒకటి నొక్కాలని కరపత్రాలు ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు
Reporter
Namitha News