Thursday, 30 July 2026 11:30:35 PM
# నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు

ఇండస్ట్రీ విజిట్ లో మిట్స్ విద్యార్థులు

Date : 19 May 2026 04:24 PM Views : 109

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 19 : మదనపల్లె సమీపం లోని అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం వారు మిట్స్ ఇండస్ట్రీ రిలేషన్స్ సెల్ వారి ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం పారిశ్రామిక విద్యా పర్యటన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బి.టెక్ మరియు ఎం.టెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు బెంగళూరులోని భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ-డాక్) కేంద్రాన్ని సందర్శించినట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు సీ-డాక్ నాలెడ్జ్ పార్క్ మరియు ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్‌లలో అమలవుతున్న అత్యాధునిక సాంకేతిక పరిశోధనలు, ప్రాజెక్టులను ప్రత్యక్షంగా పరిశీలించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఎమ్.రోహిత్ రెడ్డి, ప్రాజెక్ట్ ఇంజనీర్ మరియు అక్షయ, ప్రాజెక్ట్ అసోసియేట్ లు పాల్గొని భారతదేశపు స్వదేశీ మైక్రోప్రాసెసర్ ‘వేగా’ రూపకల్పన, క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలలో జరుగుతున్న పరిశోధనలపై అవగాహన కల్పించారు. అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ ట్రైనింగ్ స్కూల్ ద్వారా అందిస్తున్న పరిశ్రమ-ఆధారిత శిక్షణా కార్యక్రమాలు, అంతర్జాతీయ స్థాయి ప్లేస్‌మెంట్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ పారిశ్రామిక పర్యటన ద్వారా విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న పుస్తక జ్ఞానాన్ని పరిశ్రమలలో అమలవుతున్న ప్రాక్టికల్ సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించుకునే అవకాశం పొందడంతో పాటు, గ్లోబల్ టెక్నాలజీ ధోరణులు మరియు భవిష్యత్తులో ఉన్న ఉపాధి అవకాశాలపై స్పష్టమైన అవగాహన పొందారని తెలిపారు. ఈ పర్యటనలో డాక్టర్ ఆర్. నిధ్యా మరియు టి. తంగరసన్ ల అధ్యాపక బృందం మరియు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :