Friday, 31 July 2026 01:52:40 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

పశు ఆరోగ్య శిబిరం లను సద్వినియోగం చేసుకోండి - సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి

ఈనెల 19 నుండి 31 వరకు జాతీయ పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్న పశుసంవర్ధక శాఖ

Date : 19 January 2026 04:08 PM Views : 163

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 19 : ఈనెల 19 నుండి 31 వరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడే జాతీయ పశు ఆరోగ్య శిబిరాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని, పశువులకు వచ్చే పలు వ్యాధులకు మందులు మరియు టీకాల పంపిణీ జరుగుతుందని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. సోమవారం మధ్యాహ్నం మదనపల్లి కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో రూపొందించిన జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంపై గోడ పత్రికను మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ మధుసూదనరావుతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ పశువులకు సకాలంలో టీకాలు వేయించడం ద్వారా ఎన్నో వ్యాధులను అరికట్టవచ్చని తద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చు అన్నారు. అన్నమయ్య జిల్లాలో ఈనెల 19 నుండి 31 వరకు పశువులకు దూడలకు మరియు సన్న జీవాలకు నట్టల నివారణ మందులు ఉచితంగా త్రాపించబడతాయని, గొర్రెలు మేకలకు ఉచితంగా బొబ్బ వ్యాధి చీడపారుడు, చిటుక, నీలి నాలుక, వంటి వ్యాధులకు వ్యాధి టీకాలు ఉచితంగా అందించడం జరుగుతుందని వ్యాధులకు టీకాలు పంపిణీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ టీకాలను మరియు మందులను రైతులందరూ వినియోగించుకొని పశువులకు వచ్చే వ్యాధులు నివారించుకోవచ్చని సూచించారు. శాస్త్రీయ పశు యాజమాన్య పద్ధతులు మరియు పశువిజ్ఞానం పై అవగాహన సదస్సులు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. గోకులాలు వాటి నిర్మాణం పై అవగాహన కల్పించడం జరుగుతుందని, సంచార పశు ఆరోగ్య సేవ కేంద్రాలు నిర్వహించబడతాయని, పశు బీమా పథకం అమలు పశు కిసాన్ క్రెడిట్ కార్డు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. రైతులందరూ ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని మదనపల్లి సబ్ కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మధుసూదనరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్ పిళ్ళై, ఆ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :