Sunday, 02 August 2026 05:23:28 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

యువత అంబేడ్కర్ మార్గంలో నడవాలి -- బాస్ యువజన విభాగం పిలుపు

Date : 19 April 2026 06:15 PM Views : 155

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : యువత అంబేడ్కర్ మార్గంలో నడవాలి -- బాస్ యువజన విభాగం పిలుపు బోధిసత్వ బాబాసాహెబ్ అంబేడ్కర్ చూపిన శీలవంతమైన మార్గంలో యువత నడవాలని, భారతీయ అంబేడ్కర్ సేన (బాస్) యువజన విభాగం నేతలు పిలుపునిచ్చారు. "యువత - నైతికత" అన్న అంశంపై ఆదివారం ప్రెస్ క్లబ్ లో, బాస్ యువజన విభాగం ఆధ్వర్యంలో అవగాహనా సదస్సు జరిగింది. ఈ సందర్బంగా జరిగిన విలేకర్ల సమావేశంలో బాస్ యువజన విభాగం నాయకులు బైనేని సురేష్, నీరుగట్టి రాజేష్, పి. పృద్విరాజ్, చాట్ల కళ్యాణ్, ఆర్. మహేంద్ర, కె. తేజ, ఎస్. ఈశ్వర్ లు మాట్లాడుతూ యువతను సరైన మార్గంలో నడిపించే స్పష్టమైన కార్యక్రమం ఏదీ ప్రభుత్వం వద్ద లేకపోవడం వల్ల, యువత పెడదోవ పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత నైతికతతో పునీతమైతే దేశం ఘననీయమైన పురోగతిని సాధిస్తుందని అభిప్రాయ పడ్డారు. యువతలో నైతికతను పెంపొందించడానికి వారికి అంబేడ్కర్ ను బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యువత అంబేడ్కర్ మార్గంలో నడిపిస్తే, దేశంలో గొప్ప ఆవిష్కరణలు జరుగుతాయని చెప్పారు. యువతను చైతన్య పరిచి, అంబేడ్కర్ మార్గంలో నడిపించడానికి, బాస్ యువజన విభాగం కృషి చేస్తుందని తెలిపారు. బాస్ యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన అంబేడ్కర్ జయంతి ముందస్తు వేడుకలు విజయవంతం చేసిన బాస్ కుటుంబ సభ్యులకు, అంబేడ్కర్ అభిమానులకు వీరు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాధికారి పోతబోలు రెడ్డెప్ప, బాస్ వ్యవస్థాపకుడు పీటీయం శివప్రసాద్, ఉద్యోగ సంఘ నాయకులు చిట్టిబాబు, చిన్నప్పలతో పాటు బాస్ నాయకులు నీరుగట్టి రమణ, గంపల రమణ, సొన్నికంటి రెడ్డెప్ప, డేగాని రమణ, వై. గంగాధర్, బురుజు రెడ్డిప్రసాద్, కృష్ణ, జనార్దన్, శశిధర్, ప్రశాంత్, తరుణ్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: