Thursday, 30 July 2026 08:00:08 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

యన్.సి.సి. సైబర్ డిఫెండర్ లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన మిట్స్ విద్యార్ధి

Date : 26 June 2026 07:38 PM Views : 55

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జూన్ 26 : మదనపల్లి పట్టణం అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి, ఎన్‌సీసీ క్యాడెట్ అండర్ ఆఫీసర్ ఎన్. సాయి హార్థిక్ కుమార్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక సైబర్ డిఫెండర్ కోర్స్–Iలో విశేష ప్రతిభ కనబరిచారని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. చెన్నైలోని వీఐటీ (VIT Chennai)లో 12 రోజులపాటు నిర్వహించిన జాతీయ స్థాయి శిక్షణా శిబిరంలో తొలి 10 రోజుల పాటు సైబర్ సెక్యూరిటీ, సైబర్ డిఫెన్స్, డిజిటల్ భద్రత, నెట్‌వర్క్ సెక్యూరిటీ తదితర ఆధునిక సాంకేతిక అంశాలపై నిపుణులచే శిక్షణ అందించారని తెలిపారు. అనంతరం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ పరీక్షకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 268 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు ఈ శిబిరంలో పాల్గొనగా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ఎన్‌సీసీ డైరెక్టరేట్ తరఫున తిరుపతి గ్రూప్ నుంచి కేవలం 8 మంది క్యాడెట్లలో చిత్తూరు జిల్లా 35(ఏ) బెటాలియన్ ఎన్‌సీసీ నుంచి ఎంపికైన ఏకైక క్యాడెట్‌గా ఎన్. సాయి హార్థిక్ కుమార్ నిలవడం గర్వకారణం అని తెలిపారు. ఈ శిబిరాన్ని ఎన్‌సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ వీరేంద్ర వత్స, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్-నికోబార్ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కమోడోర్ నంబియత్ సుదీప్ లు పర్యవేక్షణ వహించి సర్టిఫికెట్ ను అందజేశారని తెలిపారు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన యెన్ సి సి విద్యార్థిని యూనివర్సిటీ ఫౌండర్ అండ్ చాన్సలర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యెన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ ఎన్. నవీన్ కుమార్ మరియు 35 ఆంధ్ర బెటాలియన్ చిత్తూర్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టనెంట్ కల్నల్ మోనిష్ ఎన్.వి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టనెంట్ కల్నల్ పీ. లోకనాథన్ అభినందనలు తెలియజేశారు. 35 ఆంధ్ర బెటాలియన్ చిత్తూర్ తరపున సహాయసహకారాలు అందించిన కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టనెంట్ కల్నల్ మోనిష్ ఎన్.వి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టనెంట్ కల్నల్ పీ. లోకనాథన్ లకు ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ ఎన్. నవీన్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: