Thursday, 30 July 2026 01:12:16 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

జిల్లా ఖజానా ఆదాయం పెంపే లక్ష్యం - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

జీఎస్టీ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించండి

Date : 26 March 2026 08:44 PM Views : 212

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 26 : జిల్లా ఖజానాకు ఆదాయం పెంపు కోసం అన్ని ఆదాయార్జన శాఖలు సమన్వయంతో పని చేసి లక్ష్యాలను అధిగమించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం మదనపల్లి కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, రవాణా, మైనింగ్, రిజిస్ట్రేషన్, అటవీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ శాఖల వారీగా ఆదాయ సాధన పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో పన్నుల వసూళ్లలో పారదర్శకత, సమర్థత పెంపుతో పాటు ఆదాయ వృద్ధి సాధించడం లక్ష్యంగా అధికారులు కట్టుదిట్టంగా పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. మున్సిపల్, పంచాయతీరాజ్ పనుల్లో జీఎస్టీ వసూళ్లు తప్పనిసరిగా జరిగేలా చూడాలని, బిల్లులు ప్రాసెస్ చేసే సమయంలో జీఎస్టీ యాక్టివ్ స్థితిని పరిశీలించాలని ఆదేశించారు. జిల్లాలో జరిగే పనులకు ఉపయోగించే ఇంధనాన్ని రాష్ట్రంలోనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు

అక్రమ మద్యం రవాణాపై కట్టుదిట్టమైన నిఘా ఎక్సైజ్ శాఖపై సమీక్షిస్తూ, మద్యం దుకాణాలు, బార్లలో సీసీటీవీల పనితీరును పర్యవేక్షించి అవకతవకలు జరగకుండా చూడాలని చెప్పారు. పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు నుంచి అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని, దీనిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు. *జీఎస్టీ రిజిస్ట్రేషన్‌పై అవగాహన కార్యక్రమాలు* మండల అభివృద్ధి అధికారులు, గ్రామపంచాయతీలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌పై అవగాహన కల్పించి, అందరూ రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. *‘రెవెన్యూ వింగ్’తో ప్రత్యేక మానిటరింగ్* కెఆర్ఆర్‌సీ డిప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో "రెవెన్యూ వింగ్" ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి, రోజువారీ పురోగతిని సమీక్షించాలని సూచించారు. ప్రతి వారం బిల్లుల వివరాలను సేకరించి కమర్షియల్ టాక్స్ శాఖతో మరియు ఇతర శాఖల మధ్య సమన్వయం పెంపొందించాలని సూచించారు. మైన్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రవాణా, అటవీ తదితర శాఖలు తమ లావాదేవీలను క్రమబద్ధంగా నమోదు చేసి పన్నుల వసూళ్లను పెంచాలని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రెవెన్యూ వృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు

ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :