Friday, 31 July 2026 01:02:19 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

నిరక్షరాస్యులయిన వయోజనులను అక్షరాస్యులుగా చేయడమే ఉల్లాస్-అక్షర ఆంధ్ర కార్యక్రమ లక్ష్యం - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 23 February 2026 08:07 PM Views : 234

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 23 : నిరక్షరాస్యులుయిన వయోజనులను అక్షరాస్యులుగా చేయడమే ఉల్లాస్ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం మని తెలుపుతున్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. సోమవారం ఉదయం మదనపల్లి కలెక్టరేట్ లోని పి జి ఆర్ ఎస్ హాల్లో వయోజన విద్య శాఖ వారి చే "ఉల్లాస్ – అక్షర ఆంధ్ర కార్యక్రమం"కు సంబంధించిన గోడ పత్రికలను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ విడుదల చేశారు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం 2029 నాటికి వయోజనులందరినీ అక్షరాస్యులుగా మార్చడమనన్నారు. ఈ పథకం ద్వారా 15 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న నిరక్షరాస్యులకు ప్రాథమిక విద్య అందించ బడుతుందని తెలిపారు. అక్షరాస్యత తో పాటు వారికి ఆర్థిక అక్షరాస్యత,డిజిటల్ అక్షరాస్యత,వాణిజ్య నైపుణ్యాలు, ఆరోగ్య సంరక్షణ,కుటుంబ సంక్షేమం వంటి జీవిత నైపుణ్యాలు నేర్పబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా, మండల, పట్టణ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. స్వచ్ఛంద ఉపాధ్యాయులు (వాలంటీర్లు) ద్వారా తరగతులునిర్వహిస్తున్నారని సర్వేలు నిర్వహించడానికి మరియు అభ్యాసకులు, వాలంటీర్లను నమోదు చేయడానికి ఉల్లాస్ మొబైల్ యాప్ ఉపయోగిస్తున్నారని తెలిపారు.జిల్లా మరియు మండల స్థాయిల్లో శిక్షణా కార్యక్రమాలునిర్వహిస్తున్నారని, అక్షర ఆంధ్ర వాచకాలు అభ్యాసకులకు పంపిణీ చేస్తున్నారని, ఈ కార్యక్రమం ద్వారా వయోజనులను అక్షరాస్యులు గా చేసి,వారిని సమాజంలో చైతన్య వంతులు గా తీర్చిదిద్దడం లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ తెలిపారు

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో వయోజన విద్య డి.డి. వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: