నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి నుండి ప్రతిష్టత్మకైనా సంతోష్ ట్రోఫీ కి ఇద్దరు ఎంఫిక ప్రతి ఫుట్బాల్ ప్లేయర్ ఆశయంగా భావించేది సంతోష్ ట్రోఫీ కి రాష్ట్రము తరపున ప్రాతినిధ్యం వకహించడం ప్రతి ఫుట్బాల్ క్రీడాకారుని స్వప్నం, అలాంటి స్వప్నని సహకారం చేసుకున్న మదనపల్లి మండలం సిద్దమ్మగారిపల్లి చెందిన బి మల్లయ్య, బి సరస్వతి కుమారుడు బి మహేంద్ర మరియు మదనపల్లి మోతినగర్ కి చెందిన షైక్ మహబూబ్ బాషా కుమారుడు షైక్ అబ్దుల సంతోష్ ట్రోపీ కి ఎంపిక అయ్యరు. ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ డిసెంబర్ 4 నుండి 14 తేదీ వరకు పది రోజుల పాటు విజయవాడ లో క్యాంపు నిర్వహించారు. డిసెంబర్ 17 నుండి 21 వ తేదీ వరకు అనంతపురం RDT లో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలలో వీరు ఇద్దరు పాల్గొన్నారు. మహేంద్ర, సంతోష్ ట్రోపీ కలగా భావించి గత 6 సంవత్సరల నుండి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే షైక్ అబ్దుల్లా చిన్న నాటి నుండి స్వాతహాగా ఫుట్బాల్ మీద ఇష్టంతో ఆట నేర్చుకొని ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ జట్టు కి ఎంఫిక అయ్యారు.గత 15 సంవత్సరాలనుండి ఒక్కరు కూడా మన జిల్లా తరుపునుండి ఎంఫిక అవలేదు, ఈ సంవత్సరం ఒకేసారి ఇద్దరు ఎంఫిక అవ్వడం చాలా సంతోషం అని డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ అఫ్ అన్నమయ్య అధ్యక్షులు యూ దిల్లీప్ కుమార్ కార్యదర్శి కె మురళీధర్ తెలిపారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మున్ముందు చాలా క్రీడాకారులు లని తయారుచేస్తాం అని తెలియచేశారు. అలాగే వీరిని DFA మెంబెర్స్ అయినా జాన్ కామలేష్, సాగర్, మహేంద్రనాయక్, టీ వెంకటేశ్వర ప్రసాద్, కిరణ్, అభిలాష్, నరేష్, మోహన్, నరేష్ క్రీడా భారతి సెక్రటరీ,బాలాజీ, తదితరులు వీరిని అభినందించారు.
Reporter
Namitha News