Friday, 31 July 2026 03:52:55 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మెడికల్ మాఫియా ను అరికట్టాలంటూ డి.యం.హెచ్.ఓ. కార్యాలయం వద్ద సిపిఐ నిరసన

ఇది కేవలం వైద్య రంగ సమస్య మాత్రమే కాదు, ప్రజల ప్రాణాలపై జరుగుతున్న వ్యవస్థీకృత దోపిడీ

Date : 28 February 2026 08:36 PM Views : 229

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 28 : మదనపల్లి పట్టణం లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కర్యాలయం వద్ద మెడికల్ మాఫియా ను కట్టడి చేయాలి, నిర్ములించాలని ఆందోళన వ్యక్తం చేసిన సీపీఐ నాయకులు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలపై వైద్యం ముసుగులో మెడికల్ & పార్మ కంపెనీలు చేస్తున్న దోపిడిని అరికట్టాలని సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు సిపిఐ అన్నమయ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి పి మహేష్,జిల్లా సహాయ కార్యదర్శి టి కృష్ణప్ప,చిత్తూరు జిల్లా సహాయ కార్యదర్శి టి జనార్ధన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ మెడికల్&ఫార్మా కంపెనీలు ప్రజల ప్రాణాల పైన కార్పోరేట్ వ్యాపారం చేస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న,ధర నియంత్రణ ఏ మాత్రం లేకున్నా,విచ్చలవిడిగా బరితెగించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి స్కానింగ్లు,ఎక్స్రేలు,టెస్టులు పేర్లతో డయాగ్నోసిస్ సెంటర్లు లక్షల రూపాయలు వసువులు చేస్తున్నారని,రోగానికి సంబంధంలేని మాత్రలను అధిక సంఖ్యలో ప్రజలకు ఇస్తూ ప్రజలను దీర్ఘకాలిక రోగిగా మార్చేస్తున్నారన్నారు. సీజనల్ గా వచ్చే జ్వరము,జలుబు,దగ్గు లాంటి రోగాలకు ఎమ్మారై,సిటీ స్కాన్ లాంటి పెద్ద పెద్ద టెస్టులు నిర్వహిస్తున్నారని, ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం, స్కానింగ్ సెంటర్లు సిండికేట్ ఐ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ లక్షల రూపాయలు ప్రజల నుండి ప్రైవేట్ హాస్పటల్ యాజమాన్యం గుంజుకుంటున్నారని ఆరోపించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేటు యాజమాన్యం వ్యవహరిస్తున్న ప్రభుత్వ మెడికల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఫార్మసిస్టు సర్టిఫికెట్లను అద్దెకి తీసుకొని మెడికల్ షాపులు కొనసాగిస్తున్నారని, ఇలాంటి మెడికల్ స్టోర్స్ తో డ్రగ్ ఇన్స్పెక్టర్లు లాలూచీ పడుతూ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజల పైన మెడికల్& పార్మా మాఫియా నిలువు దోపిడీ చేస్తుంటే,ప్రభుత్వ అధికారులు ఫార్మా కంపెనీలకు సహకరిస్తున్నారని, ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వాలు ఫార్మా కంపెనీలు ఇచ్చేటువంటి కరెన్సీ నోట్లకు అమ్ముడు పోతున్నారాన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఫార్మా కంపెనీలు ఆగడాలు నియంత్రించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో నిరంతర పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబశివ,వెంకటేష్, నియోజకవర్గ కార్యదర్శి కే మురళి,డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు హరి,సిపిఐ నాయకులు తిరుమలప్ప,దేవ,రెడ్డి శేఖర్, మహిళ సంఘం కార్యదర్శి భార్గవి,రాధ,లక్ష్మీదేవి,లోకేష్, తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :