Sunday, 02 August 2026 04:35:46 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

మానవత్వం చాటుకున్న తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి

గాయపడిన వ్యక్తిని తన వాహనంలో ఆసుపత్రికి తరలింపు

Date : 26 April 2026 10:27 PM Views : 396

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 26 : తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి శుభకార్యం లేదా ఆ శుభకార్యం ఏదైనా కులం, మతం, ప్రాంతం బేదం లేకుండా తనకు తెలిసిన వెంటనే స్పందించడం తనకు చేతనైన సాయం చేసి ఆదుకోవడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. ఇందులో భాగంగా ఆదివారం నడిరోడ్డులో ప్రమాదం జరిగి ఓ వ్యక్తి గాయపడి బాధలో ఉన్న అతన్ని తన సొంత వాహనంలో హుటాహుటిన మదనపల్లి ఆస్పత్రికి తరలించి తన మానవత్వాన్ని మరో మారు చాటుకుని శభాష్ ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆదివారం కుప్పం నియోజకవర్గంలో ఓ వివాహానికి హాజరై తిరుగు ప్రయాణంలో తంబళ్లపల్లెలోని తన స్వగృహానికి తన వాహనంలో బయలుదేరాడు. మదనపల్లి-తంబళ్లపల్లె ప్రధాన రహదారి జోగివానిబురుజు సమీపంలో వస్తుండగా అదే సమయంలో ఓ రోడ్డు ప్రమాదం జరిగి ద్విచక్ర వాహనంలో వస్తున్న తంబళ్లపల్లెకు చెందిన మహబూబ్ పీర్ తీవ్రంగా గాయపడ్డాడు. 108 వాహనం కోసం ఎదురుచూస్తున్న సంఘటన చూసి చెలించి పోయిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి హుటాహుటిన వాహనం ఆపి బాధితున్ని పరామర్శించి ధైర్యం చెప్పి తన వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్సలు దగ్గరుండి చేయించాలని మండల వైకాపా అధ్యక్షుడు రేపన చౌడేశ్వర, నాయకులను పురమాయించి ప్రమాద విషయం బాధితులు కుటుంబ సభ్యులకు తెలియజేయాలని సూచించారు.అనంతరం వేరే వాహనంలో ఎమ్మెల్యే తంబళ్లపల్లె స్వగృహానికి బయలుదేరారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రమాద స్థలంలో ఆయన పడిన ఆందోళన, చూపిన చొరవ చూసి స్థానిక ప్రజలు ఔరా మన ఎమ్మెల్యే మనసున్న మారాజని కొనియాడడం కొసమెరుపు

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: