Thursday, 30 July 2026 09:31:51 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మిట్స్ యూనివర్సిటీ ని సందర్శించిన పాలిటెక్నిక్ విద్యార్థులు

Date : 18 February 2026 07:06 AM Views : 202

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఫిబ్రవరి 17 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ను మదనపల్లి, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సివిల్ విద్యార్థులు యూనివర్సిటీ విజిట్ లో భాగంగా సందర్శించారని వైస్ చాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ సి.యువరాజ్ మాట్లాడుతూ ప్రస్తుతం పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆధునిక నిర్మాణ సాంకేతికతలు, బిల్డింగ్ విధానాలు, నాణ్యత నియంత్రణ ప్రమాణాలు మరియు భద్రతా చర్యలపై అవగాహన కలిగి ఉండటం చాలా అవసరమని అన్నారు. డిప్లొమా విద్యార్థులు ప్రయోగశాల అనుభవం, ఫీల్డ్ ట్రైనింగ్ మరియు ఇండస్ట్రీ పరిజ్ఞానం ద్వారా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. మిట్స్ విశ్వవిద్యాలయ సందర్శనలో భాగంగా సివిల్ ఇంజినీరింగ్ విభాగంలోని స్ట్రక్చరల్ ఇంజినీరింగ్, జియోటెక్నికల్ ఇంజినీరింగ్, కాంక్రీట్ టెక్నాలజీ మరియు సర్వేయింగ్ ల్యాబ్‌లను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రయోగశాలల్లో ఉపయోగిస్తున్న ఆధునిక పరికరాలు, నిర్వహిస్తున్న ప్రయోగాలు మరియు పరిశోధనా కార్యక్రమాలపై అధ్యాపకులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. నిర్మాణ రంగంలో నాణ్యత నియంత్రణ, ప్రయోగాత్మక నైపుణ్యాల ప్రాముఖ్యత మరియు ఉన్నత విద్యావకాశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్శన ద్వారా విద్యార్థులు సివిల్ ఇంజినీరింగ్ రంగంపై మరింత అవగాహన పెంపొందించుకుని, భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించేందుకు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో ఉన్న విస్తృత ఉద్యోగ అవకాశాలు, కాంట్రాక్టింగ్ రంగంలో స్వయం ఉపాధి అవకాశాలు కెరీర్ అభివృద్ధి సాధ్యమని పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు నూరుల్లా బాషా తెలిపారు. కార్యక్రమంలో అడ్విసెర్ (ఆర్ &డి) డాక్టర్ తులసిరామ్ నాయుడు, డీన్ - స్కూల్ అఫ్ ఇంజనీరింగ్ డాక్టర్ దీపాంకర్ రాయ్, విభాగాధిపతి డాక్టర్ విజయకుమార్ నటేశన్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :