Friday, 31 July 2026 03:52:55 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా నాదెళ్ల విద్యాసాగర్ – మదనపల్లి 2వ డిపో అధ్యక్షులుగా జోలిపాలెం దేవేంద్రబాబు ప్రమాణ స్వీకారం

Date : 07 February 2026 09:32 PM Views : 159

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా నాదెళ్ల విద్యాసాగర్,మదనపల్లె 2వ డిపో అధ్యక్షులుగా జోలిపాలెం దేవేంద్రబాబు (చిన్ని) శనివారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. మదనపల్లె పట్టణంలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమం వైభవంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు వై. శ్రీనివాస్ రావు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ పి.వి. రమణ రెడ్డి, కడప జోనల్ అధ్యక్షులు పి. వినోద్ కుమార్, కడప జోనల్ సెక్రటరీ చెన్న రెడ్డి, జిల్లా సెక్రటరీ పి.ఎస్. రాజు, పీలేరు అధ్యక్షులు రెడ్డప్ప రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వై. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, సంస్థ బలోపేతం దిశగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాయకులు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ప్రజలతో నిత్యం మమేకమై సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. నూతన జిల్లా అధ్యక్షులు నాదెళ్ల విద్యాసాగర్ మాట్లాడుతూ, తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ, జిల్లా వ్యాప్తంగా సంస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. అలాగే మదనపల్లి 2వ డిపో అధ్యక్షులు జోలిపాలెం దేవేంద్రబాబు (చిన్ని) మాట్లాడుతూ, కార్మికుల సమస్యలను గుర్తించి, న్యాయసమ్మతమైన పరిష్కారాల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. సభా ప్రాంగణం నినాదాలతో మార్మోగగా, కార్యక్రమం సౌహార్ద్ర వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :