Thursday, 30 July 2026 08:40:44 PM
# నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు

మదనపల్లె లో భగవాన్ బిర్సా ముండా 151 వ జయంతి వేడుకలు

భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు

Date : 15 November 2025 05:51 PM Views : 155

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్ 15: భారతీయ జనతాపార్టీ కిసాన్ మోర్చా జోనల్ కార్యాలయంలో బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు పిల్ల స్వామి నాయక్ అధ్యక్షతన భగవాన్ బిర్సా ముండా 151 వ జయంతి వేడుకలను శనివారం మదనపల్లె ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పులి రెడ్డి నరేంద్ర కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భగవాన్ బిర్సా ముండా 151 వ జయంతి ముండా (1875–1900) బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ముండా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన గౌరవనీయమైన ఆదివాసీ నేత మరియు స్వాతంత్ర్య సమరయోధుడని మరియు ఆదివాసీ హక్కులు, స్వయం పాలన కోసం చేసిన ఆయన పోరాటం, స్థానిక గిరిజన సమాజాలకు ప్రతిఘటన మరియు శక్తివంతతకు ప్రతీకగా నిలిచిందని కొనియాడారు.ఆయన స్మరణార్థం ప్రతి సంవత్సరం నవంబర్ 15న భారత్‌వ్యాప్తంగా జనజాతీయ గౌరవ్ దివస్ జరుపుకుంటున్నారు. 2024 నవంబర్ 15న, గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బీహార్‌లోని జమూయి జిల్లాలో భగవాన్ బిర్సా ముండా 150వ జయంత్యుత్సవాలను ప్రారంభించారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ఒక స్మారక నాణెం మరియు పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. ఆయన భారతీయ ఆదివాసీ వారసత్వం మరియు స్వాతంత్ర్య పోరాటానికి చేసిన సేవలను ప్రముఖంగా తెలియజేస్తూ, ఈ సంవత్సరం పాటు జరుపుకునే కార్యక్రమాలు 2025 నవంబర్ 15 వరకు కొనసాగనున్నాయని వారి సేవలను స్మరించుకుని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు నారద రెడ్డి బిజెపి కిసాన్ మోర్చా రాయలసీమ జోనల్ ఇన్చార్జ్ ఓసూరి కిరణ్ కుమార్ జనసేన చేనేత వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, సామాజిక సేవకురాలు పీట్ల అంజలి డేరంగుల రమేష్ రాజు,రామ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :