Thursday, 30 July 2026 07:18:46 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

బలవంతపు భూసేకరణ ను నిరసిస్తున్నాం - సీపీఐ

భూనిర్వాసితులతో సమావేశమైన సీపీఐ నాయకులు

Date : 09 March 2026 05:13 PM Views : 227

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - మార్చి 09 : తంబళ్లపల్లి మండలం కుక్కరాజుపల్లి గ్రామంలో ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటు పేరుతో రైతుల నుంచి భూములను ప్రభుత్వ అధికారులు బలవంతంగా సేకరించే ప్రయత్నం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామంటున్న సీపీఐ నాయకులు. సోమవారం పార్క్ కోసం భూములు కోల్పోతున్న రైతులతో సమావేశమైన సీపీఐ నాయకులు కృష్ణప్ప, సాంబశివ. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ రైతులు తమ పంట పొలాలను ఇవ్వడానికి అంగీకరించకపోయినా, వారి అభిప్రాయాలను పట్టించుకోకుండా అధికారులు ఒత్తిడి తేవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలిపారు. రైతుల జీవనాధారం భూమి. వారి సమ్మతి లేకుండా భూములు తీసుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుల అభిప్రాయాలు తీసుకోవడం, గ్రామ సభ నిర్వహించడం, సరైన నష్టపరిహారం మరియు పునరావాసం కల్పించడం తప్పనిసరి. కానీ కుక్కరాజుపల్లి గ్రామంలో ఈ నిబంధనలు పాటించకుండా భూసేకరణకు ప్రయత్నించడం రైతుల హక్కుల ఉల్లంఘన అని విమర్శించారు. రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించని పరిస్థితిలో ప్రభుత్వం బలవంతపు భూసేకరణ ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని సీపీఐ డిమాండ్ చేస్తోంది. రైతుల అభిప్రాయాలను గౌరవించి, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ సమావేశంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :