నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 13 : ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతికి అండగా నిలిచిన కేంద్ర ప్రభుత్వానికి తంబళ్లపల్లె మండల పరిషత్ అధికారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉదయం ఏవో థామస్ రాజా ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర ఏకైక మన రాజధాని అమరావతి కృతజ్ఞత పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్ర రాజధాని అమరావతి కావడం రాష్ట్ర ప్రజల అదృష్టమని నేడు మనతోపాటు మన భావితరాలు రాష్ట్ర రాజధాని అమరావతిగా చెప్పుకోవడం గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో పివి ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ బాలకృష్ణ నాయక్, టైపిస్ట్ సురేంద్ర, జూనియర్ అసిస్టెంట్ విజయ్, ఆఫీస్ సబార్డినేట్లు నాగరాజు, ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News