Friday, 31 July 2026 06:29:16 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మున్సిపల్ అప్కాస్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి

Date : 28 June 2026 02:50 PM Views : 81

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూన్ 28 : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఇంజనీర్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ జాయింట్ ఆక్షన్ కమిటీ వైస్ చైర్మన్ గంజి రామమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో గల మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు మేరకు సమాన పనికి సమాన వేతన ఇవ్వాలని ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ నందు పనిచేయుచు మరణించిన ఉద్యోగ కుటుంబ సభ్యులలో ఒకరు ఉద్యోగం అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు మరియు పుంగనూరు పురపాలక సంఘం అధ్యక్షులు రెడ్డిపల్లి శ్రీరాములు మాట్లాడుతూ రాష్ట్రంలోని మున్సిపల్ ఆప్కాస్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ పుంగనూరు పురపాలక సంఘం అధ్యక్షులు రెడ్డిపల్లి. శ్రీరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023లో తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యాక్ట్ ద్వారా కేవలం 2014 నాటికి ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కొంతమంది కాంట్రాక్టు ఉద్యోగుల కే పరిమితంగా రెగ్యులరైజేషన్ అయ్యే అవకాశం కల్పించిందని అయితే రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నగర పంచాయతీల్లో దశాబ్దాలుగా సేవలందిస్తున్న సుమారు 50000 మంది అప్కాస్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ చట్ట పరిధిలోకి రాకుండా వారికి అన్యాయం జరిగిందని ఆవేదనను వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం సజావుగా నడపడంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత ,సమాన పనికి సమాన వేతనం, పదవీ విరమణ ప్రయోజనాలు ఇతర సౌకర్యాలకు నోచుకోకుండా అన్యాయానికి గురవుతున్నారు. ఎంతోమంది పది సంవత్సరాలు నుండి 20 సంవత్సరాల పైగా ప్రభుత్వ రంగ సంస్థల్లో సేవలందిస్తున్నప్పటి కీ ఇప్పటికీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా నే కొనసాగడం బాధాకరమని వాపోయారు. దేశంలోని ఒరిస్సా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పలు ఈశాన్య రాష్ట్రాలు ప్రత్యేక చట్టాలు లేదా విధానాలను తీసుకొచ్చి దీర్ఘకాలంగా ప్రవేశిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పెద్ద ఎత్తున చేశారని పేర్కొన్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో గల ఇంజనీరింగ్ ఔట్సోర్సింగ్ కార్మికులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాబోయే శాసనసభ సమావేశాల్లో సమగ్ర సవరణలు చేసి చట్టబద్ధత కల్పించి మున్సిపల్ ఇంజనీరింగ్ ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని తెలిపారు. లేని పక్షంలో మా జేఏసీ తీసుకుని కార్యాచరణకు కట్టుబడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ బి .శ్రీకాంత్ రెడ్డి, . డి లక్ష్మణ కుమార్, రాష్ట్ర నాయకులు మల్లవరపు గణేష్ కుమార్, తిరుపతి జిల్లా కోఆర్డినేటర్ ఈర్ల. రాము , చిత్తూరు నగరపాలక సంస్థ నుండి నీరుగట్ట. వెంకటేష్ మరియు పుంగనూరు పురపాలక సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: