నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : డిసెంబర్ 07: కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ సారథ్యం సభలని విజయవంతం చేసి కార్యకర్తలను ఉత్సాహపరిచిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణలు చేపట్టబోతున్న కార్యక్రమంలో భాగంగా ఈనెల 11 వ తారీకున ధర్మవరం లో ప్రారంభమై 14 వ తారీకు ఉదయం మదనపల్లె కదిరి రోడ్ నందు గల అన్నమయ్య సర్కిల్ వద్ద విగ్రహవిష్కరణ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు స్థాయి లోకేష్ అధ్యక్షతన జరగబోతుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఓసూరి కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ , తెలుగుదేశం మరియు జనసేన మంత్రులు అలాగే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ పార్టీ ప్రధాన కార్యదర్శులు సన్నారెడ్డి దయాకర్, నాగోతు రమేష్ నాయుడు, శ్రీశైలం దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ తదితర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ నాయకులు అలాగే ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం , జనసేన నాయకులు స్వచ్ఛందంగా తరలివచ్చి మహానేతకు నివాళులర్పించాలని కోరారు. అనంతరం టిప్పు సుల్తాన్ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని కూటమి ఐక్యతను తెలియజేసి, ఈ దేశానికి ఈ రాష్ట్రానికి వాజ్పేయి ప్రధాన మంత్రి గా గ్రామీణ సడక్ యోజన ద్వారా గ్రామీణ రోడ్లన్నీ అభివృద్ధి పరిచిన విషయాన్ని , స్వర్ణ చతుర్భుజి ద్వారా జాతీయ రహదారుల్ని అనుసంధానించిన విషయాన్ని , ఉపాధి హామీ ద్వారా అత్యధిక నిధులు ఆంధ్ర ప్రదేశ్ కి కేటాయించిన విషయాన్ని , రైల్వే లను టెలి కమ్యూనికేషన్ వ్యవస్థలను అభివృద్ధిపరిచి , ఐటి ఎదుగుదలకు తోడ్పడిన విధానాన్ని , జాతీయ సమైక్యత వాదాన్ని వినిపించి దేశాన్ని సురక్షితంగా కాపాడి ఉత్తమ విదేశీ విధానంతో ప్రపంచ దేశాలలో భారత దేశం కీర్తిని చాటిన మహానేత, ఫోక్రాన్ అను పరీక్షలు ద్వారా భారత శక్తిని ప్రపంచానికి చూపి అమెరికా ఆంక్షలు సైతం లెక్కచేయకుండా భారతదేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిన రాజనీతిజ్ఞుడైన అటల్ బిహారి వాజ్పేయి గారిని స్మరించుకోవాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కో-ఆపరేటివ్ సెల్ కన్వీనర్ గోపాల్ రెడ్డి మొలకలచెరువు మండల అధ్యక్షులు పివి జయరాం రెడ్డి బిజెపి జిల్లా కార్యదర్శి శోభారాణి బిజెపి అసెంబ్లీ మాజీ కన్వీనర్ మంగరాజు, సీనియర్ నాయకులు ద్వారకనాథ్ , శివయ్య , గోపి మహేష్ రెడ్డప్ప బాబాసాహెబ్ రవి తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News