నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : డైలీ మార్కెట్ ఎదురుగా నూతనంగా వేసిన రోడ్డపై ప్రజల ఇబ్బందులు గమనించండి -- అధికారుకు సూచించిన నిసార్ అహమ్మద్ సిమెంటు రోడ్డ వేసి క్యూరింగ్ చేసిన తరువాత బంకమట్టి రోడ్డపై వదిలేసిన కాంట్రాక్టర్ పైన అధికారులు చర్యలు తీసుకోరా అని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్ ప్రశ్నించారు. బుధవారం చిత్తూరు బస్టాండు సమీపంలో చెంబకురు వెళ్ళే రహదారిలో డైలీ మార్కెట్ సమీపంలో స్దానిక ప్రజలు నిసార్ అహమ్మద్ దృష్టికి సమస్యను తీసుకుని వెళ్ళారు. గత రెండు నెలలుగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా సంబంధిత అధికారులు స్పందించలేదని స్దానికులు వాపోయారు. నిత్యం అత్యంత రద్దీగా ఉండే దారిలో కాంట్రాక్టర్ నిర్వహకంపై నిసార్ అహమ్మద్ మాట్లాడుతూ సిమెంట్ రోడ్డ వేసి అనంతరం క్యూరింగ్ కోసం వేసిన బంక మట్టి రోడ్డు పక్కకు తోసి వేసి ప్రజలకు ఇబ్బందులు కలుగుతుందని అన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బంది స్వయంగా చూడటం జరిగిందని అన్నారు. మట్టిని తొలగించాల్సిన కాంట్రాక్టర్ పక్కకు వేసి వెళ్ళిపోయాడని, సంబంధించిన శాఖ అధికారులు తొలగించడానికి సరైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షం రావడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నాని, ఇప్పటికైన స్పందించి మట్టిని తొలగించాలని కోరారు. గతంలో సైతం చిత్తూరు బస్టాండు సర్కిల్ నుంచి ఆర్ అండ్ బి కి వెళ్ళే దారిలో సైతం సిమెంట్ రోడ్డు వేసిన సందర్భంలో ఇలాగే చేశారని గుర్తు చేశారు. అధికార యంత్రాంగం సరైన చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.
Reporter
Namitha News